Friday, May 10, 2024

పదోతరగతి సప్లిమెంటరీ హాల్‌ టికెట్లు విడుదల..

అమరావతి, ఆంధ్రప్రభ: పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ, బెటర్‌మెంట్‌ పరీక్షలు రాసే విద్యార్థుల హాల్‌ టికెట్లు అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డి. దేవానందరెడ్డి తెలిపారు. సప్లిమెంటరీ, బెటర్‌ మెంట్‌ పరీక్షలు జూలై ఏడో తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరగనున్న విషయం తెలిసిందే.

ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లు పాఠశాలల వారీగా స్కూల్‌ లాగిన్‌తో ప్రధానోపాధ్యాయులు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. ఆ హాల్‌ టికెట్లను అటెస్ట్‌ చేసి విద్యార్థులకు అందజేయాలన్నారు. అలాగే విద్యార్థులు హాల్‌ టికెట్లను జిల్లా, పాఠశాల పేరు, విద్యార్థి పేరు, డేట్‌ ఆఫ్‌ బర్త్‌ వివరాలను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌ఈ.ఏపీ.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement