Friday, April 26, 2024

సీఎం జగన్ ఇంటి వద్ద ఉద్రిక్తత

తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం జగన్‌ ఇంటి ముట్టడికి విద్యార్థి సంఘాలు ప్రయత్నించాయి. నిరుద్యోగులు సీఎం నివాసం దగ్గరకు వెళ్లేందుకు యత్నించగా… తాడేపల్లి పాత టోల్‌గేట్ కూడలి దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీఎం నివాసానికి వెళ్లే ప్రధాన మార్గం దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. సీఎం జగన్ కు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల నేతలు నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే తోపులాట జరిగింది. టీడీపీ, వామపక్ష విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణ నెలకొంది

కాగా, చలో తాడేపల్లికి..టీడీపీ, వామపక్షాలు, అమరావతి దళిత ఐకాస సహా పలు ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి. ముఖ్యమంత్రి నివాసం ముట్టడికి యత్నించిన తెలుగు యువత, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేసి బలవంతంగా పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement