Sunday, May 19, 2024

Tension – పుట్టపర్తిలో పోలీసుల ఓవరాక్షన్ – పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ రసాభాసా

(శ్రీ సత్యసాయి బ్యూరో, ప్రభాన్యూస్) : శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి జిల్లా కేంద్రంలో మంగళవారంపోస్టల్ బ్యాలెట్ పోలింగ్ లో పోలీసుల అత్యుత్సాహం రగడకు దారి తీసింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పాత్రికేయుల పట్లపుట్టపర్తి డిఎస్పీ వాసుదేవన్ దురుసుగా ప్రవర్తించడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలింగ్ కేంద్రంలో కనీస సౌకర్యాలు కల్పించలేదని, పోస్టల్ బ్యాలెట్ ఓటు ఉన్నప్పటికీ ఓటు వేసేందుకు అధికారులు అనుమతించలేదు. ఈ విషయం గురించి నారాయణ అనే ఉపాధ్యాయుడు సంబంధిత అధికారులతో సమస్యను చెప్పుకోవడానికి కూడా డీఎస్పీ వాసుదేవన్ అవకాశం ఇవ్వలేదు. దీంతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది.

ఇదే సందర్భంలో ఓబుల దేవర చెరువు మండలానికి చెందిన ఒక ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ విషయంలో కూడా ఆర్ఓ భాగ్యరేఖతో మాట్లాడేందుకు ఒక పత్రిక విలేకరి ప్రయత్నించినప్పుడు కూడా అధికారులు అదేవిధంగా పోలీసులు దురుసుగా ప్రవర్తించడం ఏమిటంటూ పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగులు వాపోయారు. ఇదే సందర్భంలో జనసేన పార్టీకి చెందిన అబ్దుల్ అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. . స్వతంత్ర అభ్యర్థి పోలింగ్ స్టేషన్ లో ఉన్న విషయాన్ని పోలీసులు గుర్తించి అతన్ని బయటికి పంపించారు. ఇంతలో టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి పోలింగ్ స్టేషన్ లోకి వెళ్లి పోలింగ్ జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. అంతేకాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సైతం అక్కడికి చేరుకొని, పోలింగ్ స్టేషన్లో కొద్దిసేపు ఉన్నారు.

- Advertisement -

దీంతో బయట ఉన్న ఉద్యోగులు ఒకసారిగా అరుస్తూ అభ్యర్థులు ఎవరు కూడా పోలింగ్ కేంద్రంలో ఉండకూడదని నినాదాలు చేశారు. వెంటనే డీఎస్పీ వాసుదేవన్ ఆధ్వర్యంలో సీఐ కొండారెడ్డి ఇతర పోలీసులు అభ్యర్థులను పోలింగ్ స్టేషన్ నుంచి బయటకి పంపించారు.పోలింగ్ స్టేషన్ వద్ద మౌలిక సదుపాయాలు కల్పించడంలోరెవెన్యూ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు విమర్శించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు అధిక సంఖ్యలో ఉండగా చిన్నపాటి విద్యాసంస్థలో పోలింగ్ నిర్వహించడం, విద్యుత్తు, నీరు వంటి సదుపాయం కూడా లేని పరిస్థితి అక్కడ నెలకొని ఉందని పలువురు ఉద్యోగులు వాపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement