Thursday, May 16, 2024

TDP Raa Kadiliraa – బటన్ నొక్కి ఎంత బొక్కావ్ .. నీ డ్రామాలు ప్రజలకు తెలుసు – చంద్ర‌బాబు

జాబ్ క్యాలండర్ కు ఎందుకు నొక్కలేదు
పది రూపాయలిచ్చి వంద నొక్కేస్తున్న గజదొంగ
9 సార్లు కరెంటుచార్జీలు పెంచారు
మూడు సార్లు ఆర్టీసీ బస్సు చార్జీలు పెరిగాయి
దిక్కుమాలిన బటన్ తో ఒక్కో కుటుంబంపై 8 లక్షల భారం
ఇక వైసీపీ , జగన్ ఇంటికే
తాడేపల్లి పిల్లికి జ్వరం వచ్చింది
గెలిచేది టీడీపీ, జనసేనే
మాడుగులలో ధ్వ‌జ‌మెత్తిన‌ చంద్రబాబు

(ఆంధ్రప్రభ స్మార్ట్, విశాఖపట్టణం ప్రతినిధి ) జగన్ బటన్ నొక్కుడు డ్రామాలను జనం గ్రహించారు, త్వరలోనే వైసీపినీ ఇంటికి వెళ్లిపోతుంది, 64 రోజుల్లో ఎన్నికలు జరుగుతాయి. టీడీపీ, జనసేన గెలవటం ఖాయం, జనంలో ముఖ్యంగా మహిళల్లో వైఎస్ జగన్ పైన, వైసీపీ పైనా తిరుగుబాటు ప్రారంభమైంది, ఈ తిరుగుబాటు ఉధృతం అవుతోంది. తుపానులా మారుతోంది, ఈ తుపానులో వైసీపీ కోట్టుకుపోవటం ఖాయం అని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అనకాపల్లి జిల్లా మాడుగులలో టీడీపీ ఏర్పాటు చేసిన రా కదలి రా సభలో చంద్రబాబు మాట్లాడుతూ, ఈ ఎన్నికలు టీడీపీ , జన సేన కోసం కాదు, రాష్ట భవిష్యత్తు కోసం, మహిళల బిడ్డల భవిష్యత్తు కోసం అని సైకో అంతంతోనే ఏపీ మోక్షం కలుగుతుందని, ఇప్పటికి ఎంతో మంది సీఎంలను చూశానని, ఇలాంటి సైకోను జీవితంలో చూడలేదన్నారు. 124 సార్లు బటన్ నొక్కానని గొప్పలు చెబుతున్నాడని, బటన్ నొక్కి ఎంత బొక్కాడో సంగతి చెప్పాలని డిమాండు చంద్రబాబు డిమాండు చేశారు.

బటన్ నొక్కి ప్రజలపై ఎంత భారం వేశాడో గుర్తించాలన్నారు. పదిరూపాయాలు ఇచ్చి 100 రూపాయాలు నొక్కెసిన దొంగ, గజదొంగ జగన్ అని తీవ్ర స్థాయిలో చంద్రబాబు ఆరోపించారు. ఈ బటన్ నొక్కి 9 సార్లు కరెంటు చార్జీలు పెంచారని, రూ.64వేల కోట్ల భారం పడిందని, మూడు సార్లు ఆర్టీసీ చార్జీలు పెంచారని, చెత్తపన్ను , ఆస్తి పన్ను పెంచారని, ప్రత్యక్ష, పరోక్ష పన్నులతోఈ దిక్కుమాలిన బటన్తో ఒక్కొక్క కుటుంబంపై 8 లక్షల భారం పెరిగిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల కోసం, జాబ్ క్యాలెండర్ కోసం ఎందుకు బటన్ నొక్కలేదు? ఐదేళ్లల్లో ఉద్యోగాలు ఇస్తానన్నాడు, ఉద్యోగం వచ్చిందా? జాబు రావాలంటే బాబు రావాల్సిందే, యువతకు బంగారు భవిష్యత్తు కోసం తెలుగుదేశం, జనసేన అధికారంలోకి రావాల్సిందే అని చంద్రబాబు అన్నారు,
మద్య నిషేదానికి ఎందుకు బటన్ నొక్కలేదు, సీపీఎస్ కోసం ఎందుకు బటన్ నొక్కలేదు, రైతుల ఆత్మహత్యల నివారణకు ఎందుకు బటన్ నొక్కలేదు, డిఎస్సీకి ఎందుకు బటన్ నొక్కలేదు, గుంతలు పడిన రోడ్లను బాగు చేసేందుకు బటన్ ఎందుకు నొక్కలేదు,అని చంద్రబాబు ప్రశ్నించారు. మైనింగ్ మాఫియాను ఎందుకు అడ్డుకోలేదు, భూగర్భ సంపదను దోచేశారు, వందల కోట్ల ఇసుక సొమ్ము తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లాల్సిందే, సొంత బ్రాండ్ల లిక్కర్ తో 30 లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు, 30 వేల మంది చచ్చిపోయారని, ఇక ఉత్తరాంధ్రాలో హింస, అశాంతి, భూకబ్జాలు పెరిగిపోయాని, కొండల్ని అనకొండల్లా మింగేస్తున్నారని, కేంద్రం ఇచ్చే లక్షన్నరతో ఇల్లు కట్టిపెడుతున్నానని జగన్ నమ్మిస్తున్నాడని, రుషికొండలో తన ప్యాలెస్ కోసం 5 వందల కోట్లు ఖర్చు పెట్టాడని చంద్రబాబు ఆరోపించారు.

బటన్ నొక్కుడు హైడ్రామాను ప్రజలు గుర్తించారని, ప్రజలు కూడా బటన్ నొక్కటానికి సిద్ధంగా ఉన్నారని, జగన్పై యుద్ధానికి ప్రజలూ సిద్ధంగా ఉన్నారని, ప్రస్తుతం వైసీపీపై, జగన్పై జనంలో వ్యతిరేకత పెరగటంతో తాడేపల్లి పిల్లికి జ్వరం వస్తోందని, నిద్ర కూడా పోవటం లేదనిటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎద్దెవ చేశారు.

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు గెలవాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీని బంగాళాఖాతంలో కలపాలని చెప్పారు. సైకో పాలన అంతం చేస్తే తప్ప మనకు భవిష్యత్తు లేదని అన్నారు. విశాఖను క్రైమ్ సిటీగా, గంజాయి కేంద్రంగా మార్చేశారని విమర్శించారు. తన సొంత పత్రిక సాక్షికి జగన్ వందల కోట్లు దోచిపెట్టాడని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీ పోలీసులు హైదరాబాద్ లో గంజాయి అమ్ముతూ దొరికిపోయారని అన్నారు.

రాష్ట్ర ప్రజలందరికీ న్యాయం చేసే బాధ్యత తమదేనని చంద్రబాబు చెప్పారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ. 1,500 ఇస్తామని తెలిపారు. ఇంట్లో ఎంత మంది ఆడబిడ్డలు ఉంటే అందరికీ ఇస్తామని చెప్పారు. తల్లికి వందనం పేరుతో పిల్లలకు రూ. 15 వేలు ఇస్తామని అన్నారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తామని చెప్పారు. ఆడబిడ్డల కోసం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రంలో రెండున్నర కోట్ల మంది ఆడబిడ్డలు ఉన్నారని తెలిపారు.

- Advertisement -

ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పిస్తామని చెప్పారు. రైతును రాజుగా చేస్తామని.. ఏడాదికి రూ. 20 వేల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి నెల ఒకటో తేదీన ఇంటి వద్దకే వచ్చి అందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పారు. పేదలకు 2 సెంట్ల ఇంటి స్థలం ఇస్తామని తెలిపారు. టిడ్కో ఇళ్లను ఉచితంగా ఇస్తామని చెప్పారు.

సిద్ధం అన్న జగన్ సందిగ్ధంలో పడిపోయారని… ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా ట్రాన్స్ ఫర్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో జగన్ కు ఏబీసీడీలు కూడా తెలియవని చెప్పారు. జగన్ ను రాజకీయాల నుంచి తరిమేయాలని అన్నారు. అమరావతి మన రాజధాని, విశాఖ మన ఆర్థిక రాజధాని అని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement