Thursday, May 2, 2024

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటూ టీడీపీ ఆందోళన

పెట్రోల్, డీజిల్ ధరలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా తునిలో టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. కాకినాడ పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షులు యనమల శివరామకృష్ణన్ నాయకత్వంలో మంగళవారం పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి, పెట్రోల్ బంకుల వద్ద బైఠాయింపు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. టిడిపి రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు కదం తొక్కారు. పెట్రోల్ డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం విధించిన వ్యాట్ ట్యాక్స్ ను మిగిలిన రాష్ట్రాల మాదిరిగానే తగ్గించాలని డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభించిన బైక్ ర్యాలీ ఎస్ఏ రోడ్, పార్క్ సెంటర్, ఆంజనేయ స్వామి గుడి, బాలికోన్నత పాఠశాల, మెయిన్ రోడ్డు మీదుగా గొల్ల అప్పారావు సెంటర్ కి చేరుకుంది. అనంతరం పార్టీ శ్రేణులు పెట్రోల్ బంకుల వద్ద ధర్నా  నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ యువనేత యనమల శివరామకృష్ణన్ మాట్లాడుతూ పెట్రోల్ ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాలన్నారు. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ ధరలు తగ్గిస్తున్నప్పటికీ జగన్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుందని తీవ్రంగా విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement