Sunday, April 28, 2024

TDP – నీతి, నిజాయితీతో నిస్వార్ధంగా సేవ చేసే వారే రాజకీయాల్లోకి రావాలి ఎంపీ కేశినేని

.(ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో)నీతి నిజాయితీతో నిస్వార్ధంగా ప్రజా సేవ చేసేందుకే రాజకీయాల్లోకి రావాలని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్(నాని) పేర్కొన్నారు. కొందరు స్వార్ధపరులు చేస్తున్న స్వార్థ రాజకీయాలు అవినీతి నీ తాను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించనన్నారు.

ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పట్నాల హరిబాబు, పశ్చిమ నియోజకవర్గ సీనియర్ నేత ఎంఎస్ బేగ్ ఆధ్వర్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లోని పలు పార్టీల నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నగరంలోని విజయవాడ పార్లమెంట్ సభ్యుడి కార్యాలయం కేశినేని భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాని వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు

. ఈ సందర్భంగా అయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడ వెస్ట్ నుంచి తన కుమార్తె శ్వేత పోటీ చేస్తుందన్న ప్రచారం జరుగుతోందన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తాను,, తన కుమార్తె కానీ, తన కుటుంబ సభ్యులు ఎవరు పోటీ చేయరనీ స్పష్టం చేశారు. నీతి నిజాయితిపరులే రాజకీయాల్లోకి రావాలనీ, సంపాదన కోసం కొంతమంది రాజకీయాల్లోకి రావడం ఫ్యాషన్‌గా మారిందన్నారు. నేను దోచుకోను.. ఇంకొకరిని దోచుకోనివ్వను.. అందుకే నాపై అక్రమార్కులు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారన్నారు.

2019లో ఎమ్ ఎస్ బేగ్ తెలుగుదేశం పార్టీలో చేరారనీ నేను ఎంఎస్ బేగ్ ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే చంద్రబాబు వద్దకు తీసుకు వెళ్లినట్లు చెప్పారు. పశ్చిమ నియోజకవర్గం పట్ల, ముస్లింసామాజిక వర్గం పట్ల, ఎమ్మెస్ బేగ్ తండ్రి స్వర్గీయ ఎంఎస్ బెగ్ కి ఉన్న నిబద్ధత ఎమ్ ఎస్ బేక్ కి కలిసి వస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీలో మరో 25, 30 ఏళ్లు నిజాయితీ గల,మంచి ముస్లిం నాయకుడు ఉండాలని ఎమ్ ఎస్ బెగ్ కి పశ్చిమ నియోజకవర్గం లో నా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.

- Advertisement -

విజయవాడలో అవినీతి, అక్రమార్కులను సహించేది లేదు. వారితో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. కొన్ని కబంధహస్తాల నుంచి వెస్ట్ నియోజకవర్గాన్ని కాపాడేందుకే బాధ్యత తీసుకున్నా. పశ్చిమ నియోజకవర్గ ఓటర్లు మంచి వ్యక్తిని ఎన్నుకుంటారని అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్(అన్న), రాష్ట్ర నగరాల సాధికార సమితి తిరుమలేష్, జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి వాసం మునయ్య, మాజీ డిప్యూటీ మేయర్ గోగుల్ రమణ, జిల్లా కార్యాలయ కార్యదర్శి సారేపల్లి రాధాకృష్ణ, పశ్చిమ నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు సుఖాసి సరిత, పలు డివిజన్లో అధ్యక్ష కార్యదర్శులు, మహిళా నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement