Sunday, May 5, 2024

సత్తెనపల్లిలో హై టెన్షన్.. టీడీపీ నేత కోడెల శివరాం హౌస్ అరెస్ట్

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో టెన్షన్ వాతావరణ నెలకొంది. టీడీపీ నేత కోడెల శివరాంను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆయన ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. చంద్రన్న ఆశయ సాధన పేరుతో శనివారం పాదయాత్ర చేసేందుకు కోడెల శివరాం సిద్ధమయ్యారు. రాజుపాలెం నుంచి దేవరంపాడు కొండ వరకు పాదయాత్ర చేయాలని సంకల్పించారు. అయితే పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో కోడెల ఇంటితోపాటు సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలువురు టీడీపీ నేతల ఇళ్ల వద్ద కూడా పోలీసులు మోహరించారు. రాజుపాలెం మండలం టీడీపీ అధ్యక్షుడు అంచుల నరసింహారావును కూడా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.

ఇది కూడా చదవండి: పూర్తిగా కోలుకున్న సాయి ధరమ్ తేజ్.. ఇదిగో సాక్ష్యం!

Advertisement

తాజా వార్తలు

Advertisement