Tuesday, April 30, 2024

తెలుగుదేశం ముంద‌స్తు వ్యూహం…నియోజ‌క‌వ‌ర్గాల జోన్ల వారిగా సమీక్ష‌లు

ఐదు జోన్లుగా నియోజకవర్గాల విభజన
35 నియోజకవర్గాలు ఒక జోన్‌గా ఏర్పాటు
ముందస్తు ఎన్నికలకు నేతలు, కార్యకర్తల సన్నద్ధం
ఈ నెల 21 నుంచి 25 వరకు ఐదు రోజుల పాటు జోన్ల వారీ సమావేశాలు
స్ట్రాటజీ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబు

అమరావతి,ఆంధ్రప్రభ: రానున్న ఎన్నికలకు నేతలను, కార్యకర్తలను సిద్ధం చేసే దిశగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సన్నాహాలు మొదలుపెట్టారు. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ వాటిని అమలు చేసే పనిలో నిమగ్నమ య్యారు. దీనిలో భాగంగా తాజాగా ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గా లను ఐదు జోన్లుగా విభజించి ముందస్తు ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వ ర్యంలో ఉండవల్లిలో పార్టీ స్ట్రాటజీ కమిటీ సమావేశం జరి గింది. ఈ సందర్భంగా పలు అంశాలపై నేతలతో చంద్రబాబు చర్చించారు. నారా లోకేష్‌ పాదయాత్రతో పాటు రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, అక్రమ కేసులు, ప్రభుత్వం చేస్తున్న అప్పులు, ఉద్యోగులు, ఉపాద్యాయుల వేతనాల్లో జాప్యం తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఇదే సందర్భంగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఖాయమన్న అభిప్రాయాన్ని చంద్రబాబు మరోసారి నేతలకు స్పష్టం చేశారు.

పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయడంలో భా గంగా ప్రతి 35 నియోజకవర్గాలను ఒక జోన్‌గా విభజి స్తున్నట్లు ప్రకటించారు. అలాగే జోన్ల వారీ గా సమావేశాన్ని కూడా నిర్వహించే తేదీలను వెల్లడించారు. ఈ నెల 21 నుంచి 25 వరకు ఐదు రోజుల పాటు జోన్ల వారీ సమావేశాలను నిర్వహించనున్న ట్లు తెలపడంతో పాటు ఈ సమా వేశాల్లో తాను స్వయంగా పాల్గొం టానని తెలిపారు. 21న కడపలో, 22న నెల్లూరులో, 23న అమరావతి లో, 24న ఏలూరులో, 25న వి శాఖలో పార్టీ జోన్‌ సమావేశాలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ సమావేశాల్లో నేతలు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో అవలంభించాల్సిన వ్యూహాలు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై స్పష్టతనివ్వను న్నారు. ముఖ్యంగా అధికార పార్టీ వైఫల్యాలను ప్ర జల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో వివేకా హత్య కేసు, సీబీఐ విచారణ తదితర అంశాలను నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. అలాగే అధికార పార్టీలో తిరుగుబాటు అంశం కూడా చర్చకు వచ్చింది. మరోవైపు అమరావతిపై కేంద్రం ఇచ్చిన స్పష్టత, రాజధానిని తరలిం చాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై కూడా చర్చ జరి గింది.
ఐదు కోట్ల మంది ప్రజలు ఒకవైపు ఉంటే.. అధికార పార్టీ మాత్రం మరోవైపు ఉందని చంద్రబాబు ఈ సం దర్భంగా వ్యాఖ్యానించారు. అధికార పార్టీ లో దాదాపు 75 మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా నేత లు ప్రస్తావించారు. ప్రస్తుతం ఉన్న పరిణామా ల నేపథ్యంలో అధికా ర వైకాపా ముందస్తుకు వెళ్తుందన్న అభి ప్రాయాన్ని చంద్రబా బు వ్యక్తం చేశారు. పార్టీకి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని ఈ నేపథ్యంలో నేతలు నియోజకవ ర్గాల్లో పూర్తిస్థాయి పనితీరును కన బర్చాలని స్పష్టం చేశారు. అలాగే పార్టీలో తీసుకోవాల్సిన భవిష్యత్‌ నిర్ణయాలపై కూడా వ్యూహ కమిటీ చర్చించింది. త్వరలో జరగనున్న జోన్ల వారీ సమావేశాల్లో నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, ముఖ్యనేతలు, క్లస్టర్‌ ఇంఛార్జ్‌లు, డివిజన్‌ ఇంఛార్జ్‌లు హాజరయ్యేలా ప్రణాళికలు రూపొందించారు.

160 స్థానాలు ఖాయం.. అచ్చెన్నాయుడు
టీడీపీ వ్యూహ కమిటీ సమావేశం అనంతరం దీనికి సం బంధించిన వివరాలను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నా యుడు మీడియాకు వివరించారు. రానున్న ఎన్నికల్లో తెదేపా 160 స్థానాలు గెలుచుకోవడం ఖాయమన్న ధీమాను వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు దిగజారడంతో ముందస్తు ఎన్నికల ఆలోచనలో వైకాపా ఉందని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా పార్టీ యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో సన్న ద్ధం చేసేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్ల డించారు. జోన్ల వారీగా నియోజకవర్గాలను విభజించారు. మొత్తం ఐదు జోన్లగా 175 నియోజకవర్గాలను విభజించిన ట్లు తెలిపారు. లోకేష్‌ పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్ప ందన వస్తుందని అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా యువత యువగళంలో భాగస్వాములు అవుతున్నారని అచ్చెన్న పేర్కొన్నారు. కేంద్రం మార్చి బడ్జెట్‌ అనంతరం కొత్తగా అప్పులిస్తేనే ఒకట్రెండు నెలలు ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చి ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో సీఎం జగన్‌ ఉన్నారని తెలిపారు. మరోవైపు ఈడీ, సీబీఐ కేసుల భయం ఆయన్ను నిద్ర లేకుండా చేస్తుందని అన్నారు. రానున్న ఎన్ని కల్లో వైకాపాను బంగాళాఖాతంలో కలపడమే ధ్యేయంగా వ్యూహాలను సిద్ధం చేసి అమలు చేస్తున్నట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు. నేతల మధ్య అభిప్రాయ భేదాలు లేకుండా విభే దాలకు తావు లేకుండా వాటి పరిష్కారానికి కొత్త కమిటీలు వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని వ్యాఖ్యానించారు. ప్రజల్లో గ్రాఫ్‌ పడిపోవ డంతో పల్లె నిద్రలు, బస్సు యాత్రల పేరుతో ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారని నిమ్మల రామానాయుడు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏ వర్గ ప్రజలు వైకాపా పాలనపై సంతృప్తిగా లేరని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement