Saturday, May 18, 2024

పిడుగులతో తస్మాత్‌ జాగ్రత్త..

ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలలో అధిక వర్షపాతం నమోదవుతూ ఉంది. ఊరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం అక్కడక్కడా కురుస్తుంది. ప్రజలకు, వాహన దారులకు పిడుగుల భయం పట్టుకుంది. వేసవి ముగియగానే పిడుగుల కాలం మొదలవుతుంది. కొన్ని వేల మెగా వాట్ల శక్తి కలిగిన పిడుగులు అటు జీవుల ప్రాణాలు తీయడంతో పాటు విలువైన వస్తువులను కాల్చి బూడిద చేస్తుంటాయి. వర్షాకాలం ఆరంభంలో ఆకాశంలో జరిగే ఒత్తిడి, అలజడుల వల్ల పిడుగులు పడు తుంటాయి. వర్షం ప్రారంభం కాగానే నిర్లక్ష్యం విడిచి అప్రమత్తంగా ఉంటే పిడుగుల భారీ నుంచి కొంత వరకు బయట పడవచ్చు. ఆకాశంలో ఉరుములు, మెరుపులతో వర్షం పడిన సందర్భాల్లో ఏదో ఒక చోట పిడుగు కాటుకు గురై ప్రతీ ఏటా వందలాది మంది మృత్యువాత పడుతున్నారు.

మూగ జీవాలు సైతం పిడుగుకు బలైపోతున్నాయి. అధిక శాతం పశువుల కాపర్లు, వ్యవసాయ భూముల్లో పనిచేసుకునే రైతులు, కూలీలు ఎక్కువగా ఉంటున్నా రు. పిడుగులు పడే సమాచారాన్ని విపత్తుల నివారణ శాఖ ముందుగానే పలు సందర్భాల్లో ప్రకటిస్తున్నప్పటికీ ప్రమాదాలు తప్పడం లేదు. పిడుగుల బారి నుంచి తప్పించుకోవడానికి సమీపంలో గల పెద్ద భవనాల్లోకి వెళ్లడం మంచిది. లోహపు వస్తువులను తాకకుండా ఉండాలి. ఆరు బయట ప్రదేశాల్లో సెల్‌ఫోన్‌ వినియోగిం చవద్దు. ఇళ్లలో తలుపులు, కిటికీలు మూసి వేయాలి. విపత్తుల నివారణ శాఖ సైతం ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రకటి స్తుంటుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement