Saturday, April 27, 2024

ఈ నెల 28, 29 న తానా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు

అమెరికాలో ఏటా నిర్వహించే తెలుగు భాషా దినోత్సవు వేడుకలు ఈసారి వర్చువల్ విధానంలో జరుగనున్నాయి. తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) ఈ నెల 28, 29 తేదీల్లో తెలుగు భాషా దినోత్సవ వేడుకలకు సర్వం సిద్దం చేస్తోందని తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు ప్రకటించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక రెండ్రోజుల పాటు ఈ వర్చువల్ వేడుకలు జరుపనున్నట్లు తెలిపింది తానా. వ్యవహారిక భాషోద్యమ పితామహుడిగా కీర్తిప్రతిష్ఠలందుకున్న గిడుగు వేంకట రామమూర్తి జయంతి నేపథ్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పశ్చిమ బెంగాల్ మంత్రి డాక్టర్ శశి పిల్లలమర్రి (తెలుగు సంతతి వ్యక్తి) హాజరుకానున్నారు. ప్రత్యేక అతిథిగా పశ్చిమ బెంగాల్ డీజీపీ బొప్పూడి నాగరమేశ్, అతిథిగా టాలీవుడ్ నటుడు తనికెళ్ల భరణి హాజరుకానున్నారు. ఆగష్టు 28, 29 రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 లకు ప్రారంభం అవుతుందని ఈ క్రింది వివిధ మార్గాల ద్వారా వీక్షించవచ్చు.

ఇది కూడా చదవండి: వ్యాక్సిన్ తీసుకోనివారికి షాకింగ్ న్యూస్..

Advertisement

తాజా వార్తలు

Advertisement