Thursday, April 25, 2024

వృద్ధుడి సాహసం: సోనూసూద్ కోసం 1450 కి.మీ. ప్రయాణం..

కరోనా కష్టకాలంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకుని నేషనల్ హీరో అయిపోయాడు సోనూసూద్. దీంతో దేశవ్యాప్తంగా సోనూసుద్ కి అభిమానులున్నాడు. కాగా సోనూసూద్ ని కలిసేందుకు ఏపీలోని జగ్గంపేటకు చెందిన వృద్ధుడు సహసమే చేశాడు. సోసూ సేవా కార్యక్రమాలకు ఆకర్షితుడైన సోమరాజు ఎలాగైనా ఆయనను కలవాలన్న ఉద్దేశంతో స్కూటీపై ముంబై బయలుదేరారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన 69 ఏళ్ల వృద్ధుడు బొండా సోమరాజు సోనూ సూద్‌ను కలిసేందుకు స్కూటీపై ఏకంగా 1450 కిలోమీటర్లు ప్రయాణించారు.

సోసూ సేవా కార్యక్రమాలకు ఆకర్షితుడైన సోమరాజు ఎలాగైనా ఆయనను కలవాలన్న ఉద్దేశంతో స్కూటీపై ముంబై బయలుదేరారు. ఇంట్లో తెలిస్తే వెళ్లనివ్వరని భావించిన ఆయన పనిపై బయటకు వెళ్తున్నానని చెప్పి ఈ నెల 15న ఇంటి నుంచి స్కూటీపై ముంబై బయలుదేరారు. ప్రతి రోజూ 300 నుంచి 400 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ ఐదు రోజుల తర్వాత ఈ నెల 20న ముంబైలోని సోనూ సూద్ నివాసానికి చేరుకుని సోనూను కలిశారు. ఈ సందర్భంగా సోమరాజు మాట్లాడుతూ.. సోనూ సూద్ తనపై ఎంతో ప్రేమానురాగాలు చూపించారని అన్నారు. స్కూటీపై ఇంత దూరం ప్రయాణం చేసినందుకు నొచ్చుకున్నారని, ఏదైనా చెప్పాలనుకుంటే సామాజిక మాధ్యమాల ద్వారా చెబితే సరిపోతుందని అన్నారని సోమరాజు పేర్కొన్నారు. జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలని సూచించారని చెప్పారు. సోనూ సూచన మేరకు అక్కడ తన స్కూటీని పార్శిల్ చేసి రైలులు బయలుదేరి ఈ నెల 24న ఇంటికి చేరుకున్నట్టు సోమరాజు వివరించారు.

ఇది కూడా చదవండి: మళ్లీ తెరపైకి టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. ప్రముఖ హీరో, హీరోయిన్‌లకు ఈడీ నోటీసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement