Monday, May 6, 2024

ఏపీ పునర్విభజనపై పిటిషన్​ స్వీకరించిన సుప్రీంకోర్టు.. వచ్చేవారం లిస్ట్‌లో పెట్టాలని రిజిస్ట్రీకి ఆదేశం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ పునర్విభజన వ్యవహారంలో మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. విభజన వ్యవహారంలో నియమ నిబంధనలపై ఉండవల్లి గతంలో పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనలు రూపొందించేలా కేంద్రానికి సూచనలు ఇవ్వాలని పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు. ఏపీ పునర్విభజన సమయంలో తప్పులు జరిగాయని, విభజన ప్రక్రియ సరిగా జరగలేదంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తయినందున భవిష్యత్‌లో జాగ్రత్తలు తీసుకోవాలని ఉండవల్లి సవరణ పిటిషన్ వేశారు. ఈ అంశాన్ని సీజేఐ జస్టిస్ ఎన్​వీ రమణ ధర్మాసనం ముందు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ప్రస్తావించారు. పిటిషన్ దాఖలు చేసి చాలాకాలమైందని ప్రశాంత్ భూషణ్ గుర్తు చేశారు. ఆయన సూచనను పరిగణనలోకి తీసుకున్న సీజేఐ ఈ పిటిషన్‌పై త్వరితగతిన విచారణ జరిపేందుకు అంగీకారం తెలిపారు. వచ్చేవారం లిస్ట్‌లో ఈ పిటిషన్‌ను పొందుపరిచేలా చూడాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement