Monday, May 6, 2024

Strike – మంత్రుల ఇళ్లను ముట్టడించిన అంగన్వాడీలు…

శ్రీకాకుళం, డిసెంబర్ 27:రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడి కార్యకర్తలు నిర్వహిస్తున్న సమ్మెలో భాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్త పిలుపుమేరకు శ్రీకాకుళం జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల తో పాటు ఆయా నియోజకవర్గాలలో శాసనసభ్యుల ఇళ్లను కూడా ముట్టడించారు.

జిల్లాలోని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటిని ముట్టడించేందుకు అంగన్వాడీలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు అంగన్వాడీలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది అదేవిధంగా పలాసలో రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి అప్పలరాజు ఇంటిని కూడా అంగన్వాడీలు ముట్టడించగా ఇక్కడ కూడా పోలీసులకు ,అంగన్వాడీలకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది .అంగన్వాడీలకు మద్దతుగా సిఐటియు నాయకులు కూడా ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement