Sunday, April 28, 2024

AP | పాఠశాలల్లో సైన్సు ఉపాధ్యాయుల కొరత.. విజ్ఞాన శాస్త్రంపై చిన్నచూపేలా

అమరావతి, ఆంధ్రప్రభ: ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అన్న చందాన ఉంది ఏపీ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పరిసితి. ఒకవైపు అంతర్జాతీయ స్థాయి ఐబీ సిలబస్‌ను ప్రాధమిక పాఠశాల నుండి అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాని పాఠశాలల్లో నేటి వరకూ అన్ని పాఠశాలల్లో విజ్ఞాన శాస్త్రాన్ని పూర్తి స్థాయిలో బోధించడానికి మాత్రం లేబరేటరీలు (ప్రయోగశాలలను) ఏర్పాటు చేయలేదు.

లేబరేటరీలు అందుబాటులో ఉన్న పాఠశాలల్లో మాత్రం వాటిని వినియోగిస్తూ విద్యార్ధులను అందుబాటులోకి తీసుకువస్తున్నవారు అతి కొద్ది మందే… ఇదిలా ఉంటే సబ్జెక్టులలో కీలకమైన సైన్సును బోధించె ఉపాధ్యాయులకు రాష్ట్రం వాప్తంగా ఉన్న అనేక పాఠశాలల్లో కొరత ఉంది. వీటిని భర్తీ చేయాలని పలుమార్లు ఆయా పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు అధికారులను కోరినా నేటికీ భర్తీ చేయలేదు. చంద్రయాన్‌ – 2 విజయవంతమై భారతదేశం విజానశాస్త్ర పరంగా ప్రపంచవ్యాప్తంగా ఖాతిని విస్తరింపజేసింది.

- Advertisement -

ఆదిత్య – ఎల్‌ వన్‌ సూరుడిపై ప్రయోగంలో కూడా ముందంజలో ఉంది. భారత దేశం విజ్ఞాన శాస్త్రంలో కొత్తపుంతలు తొకుతూ ప్రపంచం మనవైపు నివ్వెరపడి చూసేలా పురోగతిని సాధిస్తుంటే పాఠశాల స్థాయిలో అధికారులు, ఉపాధ్యాయులు సైన్సుపై చిన్నచూపు చూస్తున్నారు. దీనివల్ల విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి అవరోధంగా నిలుస్తుంది. జాతీయ అంతరాతీయ స్థాయిలో భారత దేశం విజ్ఞాన శాస్త్ర పరంగా ఎంత ముందడుగు వేసినా సరే పాఠశాల సాయిలో సైన్సుపై ప్రావీణ్యం కలిగిన విద్యార్ధులను తయారుచేయలేకపోవడం భవిష్యత్తులో విజ్ఞానశాస్త్ర పురోగతికి చాలా అవరోధంగా తయారవుతుంది.

వెంటాడుతున్న ఉపాధ్యాయుల కొరత..

పాఠశాలల్లో సైన్సు అభివృద్ధికి ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలను చేపడుతుంది. అందులో భాగంగా అటల్‌ టింకర్‌ లాబ్స్‌ (ఎటిఎల్‌), ఇన్‌స్పైర్‌ ప్రోగామ్‌, నేషనల్‌ సైన్స్‌ కాంగ్రెస్‌, చిల్డ్రన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ సైన్స్‌ ఎగ్జిబిషన్‌, ఇన్నోవేషన్‌ ప్రోగామ్స్‌ వంటి వాటిని మాత్రం మొక్కుబడిగా నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. పాఠశాల స్థాయిలో చూస్తే విద్యారులలో సైంటిఫిక్‌ యాటిట్యూడ్‌ (విజ్ఞాన శాస్త్ర ఆలోచనలు) రేకెత్తింపజేసే సైన్స్‌ సబ్జెక్టుకు సంబంధించిన భావజాలాన్ని పెంపొందించాల్సిన సైన్స్‌ ఉపాధ్యాయుల కొరత ముఖ్యంగా అనేక పాఠశాలల్లో వేధిస్తుంది.

చాలా పాఠశాలల్లో ఇటీవల కాలంలో గణితం, సైన్స్‌, ఇంగ్లీషు సబ్జెక్టులలో ఎక్కువ పదోన్నతులు కల్పించారు. కాని కాని ఈ ప్రమోషన్లను ఖాళీలకు అనుగుణంగా సరైన విధానంలో చేపట్టకపోవడంతో చాలా పాఠశాలల్లో సైన్స్‌ ఉపాధ్యాయులకు కొరత ఏర్పడింది. పదో పరీక్షలు సమీపిస్తున్న నేపధ్యంలో కనీసం పదవ తరగతి విద్యార్ధులకు కూడా సైన్సు ఉపాధ్యాయులు లేని పాఠశాలలు చాలా ఉన్నాయి. దీని వల్ల విద్యార్ధులు సైన్స్‌లో ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం లేకపోలేదు.

లేబరేటరీల లేమి…

చాలా పాఠశాలల్లో ప్రత్యేక గదిలో, సైన్సు పరికరాలతో పూర్తి స్థాయిలో ల్యాబ్‌ సౌఖర్యం లేకపోవడం వలన సైన్సు పాఠాలను కూడా బ్లాక్‌ బోర్డుపై రాసి పాత ఉపన్యాస పద్ధతిలో వింత ప్రయోగం చేసి విద్యార్ధులకు బోధించాల్సిన దుస్థితి ఏర్పడింది. పూర్వం అటల్‌ టింకరింగ్‌ (ఎటిఎల్‌) కింద రాష్ట్రంలో 713 పాఠశాలలకు సైన్సు ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. కాని వీటిల్లో ల్యాబ్‌ అసిస్టెంట్లను నియమించలేదు. కొన్ని పాఠశాలల్లో సెమీ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేశారు. ల్యాబ్‌లు లేకపోయినప్పటికీ అన్ని పాఠశాలలకు సైన్స్‌ కిట్‌లను అందజేసినట్లు అధికారులు చెబుతున్నారు.

ల్యాబ్‌లు ఏర్పాటు చేయడంకన్నా ముందుగా వర్చువల్‌ ఎలా వాడాలో, ఎలా వినియోగించుకోవాలో విద్యార్ధులకు శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంటరాక్టివ్‌ ఫాక్ట్‌ ఫ్యానల్‌ విద్యార్ధులకు ల్యాబ్‌లో ఉన్న అనుభూతిని చూపిస్తున్నామని అధికారులు చెబుతుండటం కొసమెరుపు. ల్యాబ్‌లు లేకున్నా అడపాదడపా హడావిడి చేస్తూ తూతూమంత్రంగా వైజ్ఞానికి ప్రదర్శనలు, పోటీలను నిర్వహిస్తున్నారు.

కమిషనర్‌ సీరియస్‌…

లేబరేటరీలు అందుబాటులో ఉన్న పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వాటిని వినియోగించకపోవడం, విద్యారులకు అందబాటులోకి తీసుకురావడంపై సాక్షాత్తు పాఠశాల విద్య కమిషనర్‌ గతేడాది మండిపడ్డారు. ఐదు సూచనలు, ఆదేశాలను ఇస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. కొన్ని పాఠశాలల్లో సైన్సు పరికరాలు షోకేస్‌లో పరికరాలు మాదిరిగా ఉంచారని ప్రధానోపాధ్యాయులపై మండిపడ్డారు. ల్యాబ్‌లు అందుబాటులో ఉన్న పాఠశాలల్లో తప్పనిసరిగా వాటిని వినియోగించాలని, విద్యార్ధులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

అకడమిక్‌ ఇయర్‌ కాలెండర్‌లో పొందుపరిచిన విధంగా ల్యాబ్‌ కార్యకలాపాలు జరగాలని, కాలెండర్‌లో ఉన్న విధంగా విద్యార్ధులతో యాక్టివిటీస్‌ నిర్వహించి వాటిని అసెస్‌మెంట్‌ బెక్‌, టీచర్‌ డైరీలో నమోదు చేయాలన్నారు. సదరు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తప్పనిసరిగా అసెస్‌మెంట్‌ బుక్‌, డైరీని పరిశీలించాలని ఆదేశించారు. అత్యధిక శాతం విద్యార్ధులు సైన్స్‌ ఇన్‌స్పైర్‌, ఎటిఎల్‌, ఎన్‌సిఈఆర్‌టి వంటి కాంపిటేషన్‌లో సాల్గొనేలా జిల్లా సైన్సు అధికారులు, ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఉత్తర్వులలో పేర్కొన్నారు. కానీ నేటి వరకూ సైన్స్‌లో పురోగతిని సాధించలేదు.

కొత్త ఆవిష్కరణలు జరిపేలా చర్యలు తీసుకోవాలి

  • ప్రత్యేక గదిలో పూర్తి స్థాయి సైన్స్‌ పరికరాలతో అన్ని పాఠశాలల్లో లాబరేటరీలను ఏర్పాటు చేయాలి
  • వర్చువల్‌ విధానంలో కాకుండా విశ్లేషణాత్మక విధానంలో సైన్స్‌ను బోధించాలి
  • పూర్తి స్థాయిలో సైన్సు ఉపాధ్యాయులను నియమించి ఖాళీలను భర్తీ చేయాలి
  • ఖాళీలున్న లాబ్‌ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేయాలి
  • భావితర శాస్త్రవేత్తలు తయారయే స్థాయిలో బోధన ఉండాలి
  • శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి
  • సైన్స్‌ పట్ల విద్యారులలో మక్కువ, ఆసక్తిని పెంపొందించాలి
  • భట్టీపట్టే విధానంలో కాకుండా సృజనాత్మక శక్తి పెంపొందే విధంగా బోధన ఉండాలి
  • జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఎన్‌ఎమ్‌ఎమ్‌ పరీక్షలు, ఇన్‌స్పైర్‌ అవారుల వంటి వాటికి అధిక ప్రచారం కల్పించి సైన్స్‌పై ఆసక్తిని పురికొల్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement