Wednesday, May 8, 2024

IPL 2024 | క్రికెట్ ల‌వ‌ర్స్ కి గుడ్ న్యూస్.. ఐపీఎల్ వేలం అప్పుడే !

క్రికెట్ ల‌వ‌ర్స్ కు గుడ్ న్యూస్.. ప్ర‌స్తుతం వ‌న్డే ప్ర‌పంచ కప్ జ‌రుగుతుండ‌గా, దీని త‌రువాత ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2024కు స‌న్నాహాకాలు మొద‌లు కానున్నాయి. వ‌చ్చే ఏడాది ఐపీఎల్ సీజ‌న్‌కు ఈ ఏడాది ఆఖ‌రి(డిసెంబ‌ర్)లో వేలం ప్ర‌క్రియ‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్టు తెలుస్తొంది. ఐపీఎల్‌కు పెరుగుతున్న క్రేజ్ దృష్ట్యా ఎడారి దేశ‌మైన దుబాయ్‌లో వేలం నిర్వ‌హించేందుకు ఉన్న‌ అవ‌కాశాలను బీసీసీఐ ప‌రిశీలిస్తున్నట్లు తెలుస్తొంది.

ఇక వేలానికి ముందు అన్నీ ప్రాంచైజీలు కూడా తాము రిటైన్ చేసుకునే ఆట‌గాళ్ల జాబితాను బీసీసీఐకి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే.. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ విడుద‌ల చేయ‌లేదు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ముగిసిన త‌రువాత ఈ షెడ్యూల్‌ను విడుద‌ల చేయ‌నుంది. చూడాలి మ‌రీ ఏ జ‌ట్టు ఏ ఏ ఆట‌గాళ్ల‌ను అట్టిపెట్టుకుంటాయో.. ఎవ‌రిని వేలానికి విడిచిపెడ‌తాయో.

Advertisement

తాజా వార్తలు

Advertisement