Saturday, May 4, 2024

ఎప్రిల్ 1 నుంచి లక్కీడిప్‌ ద్వారా ఆర్జిత సేవా టికెట్లు..

తిరుమల, ప్రభన్యూస్‌ : తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్‌ 1 నుంచి అర్జిత సేవలు తిరిగి ప్రారంభించి భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ఇందుకోసం కోవిడ్‌ – 19 ముందు ఉన్న పద్ధతులనే అవలంబిస్తోంది. ఇందులో భాగంగానే ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను మార్చి 20న ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఇదిలా ఉండగా గతంలో ఇస్తున్న విధంగానే తిరుమల సీఆర్‌వో కార్యాలయం వద్ద గల కౌంటర్ల ద్వారా ఆన్‌లైన్‌లో ఎలక్ట్రానిక్‌ డిప్‌ విధానంలో భక్తులకు అర్జిత సేవా టికెట్లు కేటాయించనుంది.

ఇందుకోసం భక్తులు ముందురోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నమోదు చేసుకుంటే ఎలక్ట్రానిక్‌ డిప్‌ ద్వారా ఎంపిక చేసి టికెట్లు కేటాయిస్తారు. అదేవిధంగా భక్తులు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి పీఏసీ 1 వద్ద అంగప్రదక్షిణ టోకెన్లు కేటాయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement