Thursday, April 25, 2024

తిరుమల ఘాట్‌లోని అటవీ ప్రాంతంలో ఏనుగులు హల్‌చల్‌…

తిరుమల, ప్రభన్యూస్‌ : తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో మంగళవారు ఏనుగుల గుంపు ప్రత్యక్షమైంది. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే ఘాట్‌ రోడ్డులోని ఏడవ మైలు వద్ద రోడ్డుకు సమీపంలో ఏనుగుల గుంపు సంచరించడంతో ఘాట్‌ రోడ్డులో ప్రయాణిస్తున్న భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఘాట్‌ రోడ్డులో ఏనుగుల మంద సంచరిస్తున్న సమాచారాన్ని తెలుసుకున్న టీటీడీ విజిలెన్స్‌, అటవీ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఏనుగుల మంద రోడ్డుపైకి రాకుండా తరిమివేశారు.

మొదటి ఘాట్‌ రోడ్డులోని ఏడవ మైలు వద్ద ఉన్న అటవీ ప్రాంతంలో ఓ ఏనుగుపిల్లతో పాటు మరో మూడు ఏనుగులు సంచరిస్తున్నాయని, అటవీ ప్రాంతం కావడంతో ఏనుగులు సంచారం ఉందని, గతంలోనూ ఈ ప్రాంతంలో ఏనుగులు సంచరించాయని, అవి రోడ్డు పైకి రాకుండా అన్ని చర్యలు చేపడతామని టీటీడీ డీఎఫ్‌వో శ్రీనివాసరెడ్డి తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement