Sunday, April 28, 2024

AP: ఈనెల 9 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు..

ఏపీ విద్యార్థులకు అలర్ట్.. ఈనెల 9నుంచి స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. జనవరి 9 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. అయితే, సెలవులు తగ్గించే అవకాశం ఉందంటూ ప్రచారా సాగింది. కానీ, ప్రభుత్వం ముందుగా ప్రకటించిన విధంగానే సెలవులను నిర్దారించింది. ఇదే సమయంలో సంక్రాంతి సెలవులు ఇవ్వాలని జిల్లా విద్యా శాఖాధికారులు అన్ని యాజమాన్యాలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

ఈ ఏడాది సంక్రాంతి వేళ ఆరు రోజులు సెలవులు ప్రకటించారు. ఈసారి జనవరి 13న రెండో శనివారం, జనవరి 14న భోగి పండగ (ఆదివారం), జనవరి 15న సంక్రాంతి పండగ వచ్చింది. అలాగే జనవరి 16,17,18 వ తేదీ వరకు సెలవులను ఖరారు చేసారు. తొలుత 16వ తేదీ వరకు సెలవులు ఉంటాయని భావించినా… స్కూళ్లు, కాలేజీల‌కు మ‌రో రెండు రోజులు పాటు అద‌నంగా సెల‌వులు ఇచ్చారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు ఈ నెల 9 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వాలని జిల్లా విద్యా శాఖాధికారులు అన్ని యాజమాన్యాలకు ఆదేశాలిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement