Saturday, May 25, 2024

ఇసుక‌,మ‌ట్టిపై వైసిపి,టిడిపి మ‌ధ్య గ‌రం గ‌రం వార్

అమరావతి, ఆంధ్రప్రభ : ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉన్నప్పటికీ అధికార వైకాపా, ప్రతిపక్ష తెదేపా మధ్య యుద్ధ వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. సిట్టింగులు, మాజీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోప ణలు చేసుకుంటూ పార్టీ కేడర్‌తో రోడ్డెక్కుతున్నారు. అంశమే దైనా ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధ దాటి చేతల యుద్ధం వరకూ దారితీస్తోంది. మరీ ముఖ్యంగా ఇసుక, మట్టి అక్రమ రవాణా ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నూ ప్రధాన భూమిక పోషిస్తోంది. దీనిపై అధికార వైకాపా తీరును ప్రతిపక్ష తెదేపా నేతలు ఎండగట్టే ప్రయత్నం చేసు ్తన్నారు. దానిని తిప్పికొట్టేందుకు వైకాపా నేతలు సన్నద్ధమౌ తున్నారు. ఈతరహా ఘటనలు వరుసగా చోటుచేసుకుంటు న్నాయి. అయితే, ఇసుక టెండర్లను ప్రైవేట్‌ కంపెనీ కి దక్కిందని, అలాంటప్పుడు తామెలా ఇసుక అక్రమ రవాణా చేస్తామంటూ వైకాపా నేతలు ప్రశ్నిస్తున్నారు. అక్రమాలే జరగనప్పుడు ప్రతి రోజూ వందలాది లారీలు హైద రాబాద్‌కు ఎలా తరలి వెళ్తున్నదని తెదేపా నేతలు ఎదురు ప్రశ్నిస్తు న్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం చిలికి చిలికి గాలివానగా మారుతోం ది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టా ల్సిన పరిస్థితులు, 144వ సెక్షన్‌ విధించాల్సిన పరిస్థితులు తరచూ కని పిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులను అరిక ట్టాలని పలువురు కోరుతున్నారు. ప్రశాంతంగా ఉండే పల్లె ల్లో ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడం మంచి పరిణా మం కాదని పలువురు సూచిస్తున్నారు. ఇరు పార్టీల నేతలు తమ తమ క్యాడర్‌ను సంయమనం పాటించేలా చూడాలని వారు సూచిస్తున్నారు.

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహా లో పలు సంఘటనలు చోటుచేసుగా తాజాగా గుంటూరు జిల్లా పెదకూరపాడులో జరిగిన ఘటన మరోసారి ఈ తరహా వివాదాలకు ఆజ్యం పోసింది. ఇసుక అక్రమ తవ్వకాలపై వైకాపా, తెదేపా నేతల మధ్య సవాళ్లతో పెదకూరపాడు నియో జకవర్గంలో తీవ్రఉత్కంఠ నెలకొంది. వైకాపా ఎమ్మె ల్యే నంబూ రు శంకరరావు, తెదేపా మాజీ ఎమ్మెల్యే కొమ్మాల పాటి శ్రీథర్‌ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్ల పర్వం నడిచింది. నేతలిద్దరూ ఆదివారం అమరేశ్వర స్వామి ఆలయానికి ప్రమాణం చేయడానికి వస్తామని ప్రకటించడం, ఆక్రమం లోనే ముందు రోజు రాతే శంకర్రావు అమరావతి చేరకున్నా రు. మాజీ ఎమ్మెల్యే శ్రీధర్‌ కూడా ఆదివారం ఉదయం అమరా వతికి వచ్చారు. ఇద్దరూ అమరావతి చేరుకోవడంతో పరిస్థితు లు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఈక్రమంలోనే మాజీ ఎమ్మెల్యే శ్రీథర్‌ను అరెస్టు చేయడంతో తెదేపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో శ్రీథర్‌ను అక్కడ నుండి తరలిం చారు. అనంతరం ఎమ్మెల్యే నంబూరు అమరేశ్వర స్వామి గాలిగోపురం వద్దకు పార్టీ శ్రేణులతో చేరుకుని శ్రీధర్‌కు వ్యతి రేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వైకాపా కార్యకర్తలను అక్కడ నుండి పంపేశారు.

పుట్టపర్తిలోనూ ఇసుక గొడవే

ఏప్రిల్‌ మొదటివారం లోఆధ్యాత్మిక పట్టణం పుట్ట పర్తిలో అధికార వైకాపా, ప్రతిపక్ష తెదేపా నేతలు ఘర్ష ణకు దిగడంతో ఉద్రి క్తంగా మారింది. ఒకరి పై ఒకరు రాళ్లు, కొబ్బరి కాయలు, చప్పుళ్లు విసురు కోవడంతో పోలీ సులు లాఠీఛార్జ్‌ చేసి ఇరు వర్గాలను చెదర గొట్టారు. యువగళం యాత్రలో స్థానిక ఎమ్మెల్యే డి శ్రీధర్‌ రెడ్డిపై తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అవినీతి, భూ కబ్జాలు, ఇసుక మాఫియాను ప్రోత్స హిస్తున్నారని ఆరోపణలు చేయడంతో ఇదంతా మొద లైంది. ఎమ్మెల్యే దమ్ముంటే తెదేపా నేతల ఆరోపణలను రుజువు చేయాలని, స్థానిక సత్యమ్మ ఆలయానికి వచ్చి ప్రతిజ్ఞ చేయించాలని లోకేష్‌ ను కోరారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి మాట్లాడుతూ శ్రీధర్‌రెడ్డి ఎమ్మె ల్యే అయినప్పటి నుంచి నియోజక వర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, పుట్టపర్తి లో ఏ అభివృద్ధి జరిగినా గత తెదేపా హయాంలోనే జరిగిం దని అన్నారు.

పల్లె చేసిన ఛాలెంజ్‌ని స్వీకరించిన ఎమ్మెల్యే వర్గం ఏప్రిల్‌ 1 తేదీన దేవాలయంలో బహిరంగ చర్చకు ముహూర్తం ఫిక్స్‌ చేశారు. పుట్టపర్తి పోలీసులు మాత్రం పోలీస్‌ యాక్ట్‌ సెక్షన్‌ 30 అమలులో ఉందని, ఆలయాన్ని సందర్శించవద్దని ఇరువర్గాలకు చెప్పారు. తెదేపా కార్యాల యం వద్ద పోలీసు సిబ్బందిని నియమించారు. రఘునాథ్‌ రెడ్డిని మొదట కార్యాలయం నుండి బయటకు రానివ్వలేదు. అయితే అఘునాథ్‌రెడ్డి గోడ దూకి గుడికి చేరుకున్నారు. దీనిని గమనించిన వైఎస్‌ఆర్‌సీ నేతలు కూడా అక్కడకు చేరుకున్నారు. ఎమ్మెల్యే కూడా అక్కడికి చేరుకుని ఇరువర్గా లు పరస్పరం దూషణలకు దిగారు. పోలీసుల చేత ఒప్పించి అప్పటికి అక్కడి నుంచి వెళ్లిపోతున్న వైఎస్సార్‌సీపీ కార్య కర్తలను టీ-డీపీ నేతలు రెచ్చగొట్టి గొడవకు దిగారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు చెప్పులు, కొబ్బరికాయలు విసురుకుని కొట్టు-కున్నారని పుట్టపర్తి పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసులు బలప్రయోగం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ ఘర్షణలో మాజీ మంత్రి, ఎమ్మెల్యేలకు ఒక్కో వాహనం ధ్వంసమైంది.

మైలవరంలోనూ ఇదే తంతు
ఇక ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌, మాజీ మంత్రి దేవినేని మధ్య ఇసుక, మట్టి అంశాలపై పెద్ద యుద్ధమే జరుగు తోంది. నియోజకవర్గంలో మట్టి మాఫియా విజృం భిస్తోంద ని, పోలవరం మట్టిని బొక్కేశారంటూ మాజీ మంత్రి దేవినేని ఉమా పదే పదే ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయ డం పరిపాటిగా మారింది. దీనిని సవాల్‌గా తీసుకున్న స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌ తానే మట్టి మాఫి యాపై చర్యలు తీసుకోవాలంటూ అధికా రుల కు, కలెక్టర్‌ కు ఫిర్యాదు చేశారు. దీంతో విషయం మరింత రసకందా యంలో పడింది. తన నియోజక వర్గంలో తానుగానీ, తన అనుచరు లుగానీ ఇసుక, మట్టి అక్రమ రవాణా చేయడంలేదని, అలా నిరూపిస్తే తాను ఏం చేయడానికైనా సిద్ధమేనంటూ సవాల్‌ విసిరారు. ఇది ఇరు వర్గాల మధ్య ఇంకా రాజుకుంటూనే ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement