Sunday, May 5, 2024

అట‌కెక్కిన రైతు బంధు – వ‌డ్డీ వ్యాపారుల చేతిలో రైతులు విల‌విల‌..

అమరావతి, ఆంధ్రప్రభ: అన్నదాతల సంక్షేమం కోసం ఏర్పడిన మార్కెట్‌ కమిటీ-లు అధికార పార్టీ నేతల రాజకీయ పార్టీల ఉపాధి కేంద్రాలుగా మారాయి. రాష్ట్రంలో 218 మార్కెట్‌ కమిటీ-లు వుండగా గుంటూరు, కర్నూలు, ఆదోని, అనకాపల్లి, గూడూరు, తెనాలి, దుగ్గిరాల, మదనపల్లి తదితర ప్రధానమైన మార్క్‌ట్‌ కమిటీ-లు మాత్రమే రైతులు పండించే ఉత్పత్తుల క్రయ, విక్రయాలు నిర్వహిస్తున్నాయి. సుమారు 150 మార్కెట్‌ కమిటీ-ల్లో లావాదేవీలు జరగక నామ్‌ కే వాస్తెగా వున్నాయి. ఇదిలా వుంటే , మార్కెట్‌ కమిటీ-ల ద్వారా మూడు దశాబ్దాల నుంచి నడుస్తున్న రైతుబంధు పథకాన్ని ప్రభుత్వం.. నాలుగు సంవత్సరాల నుంచి నిలిపివేసింది. దీంతో రైతుల పంటకు రుణాలు లభించక వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లో పెట్టినట్లయింది. కనీసం గోదాముల్లో పంట ఉత్పత్తుల నిల్వకూ అవకాశం లేకుండా చేసింది.

రైతుబంధు పూర్వాపరాలను పరిశీలిస్తే అన్నదాతకు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను గిట్టు-బాటు- ధరలకు విక్రయించుకునేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రైతుబంధు పథకం ప్రవేశపెట్టింది. 1982 నుంచి పంట ఉత్పత్తుల తాకట్టు-పై రుణం తీసుకునే పథకం ఉన్నా.. దానికి 1995లో రైతుబంధుగా పేరు మార్చారు. ఈ పథకం ద్వారా మార్కెట్‌ కమిటీ- గోదాముల్లో రైతులు నిల్వచేసిన పంట ఉత్పత్తులపై 75శాతం విలువ మేర గరిష్ఠంగా రూ. 2 లక్షల వరకు రుణం ఇస్తారు. దీనిపై 180 రోజుల వరకూ వడ్డీ ఉండదు. 6 నెలల నుంచి 9 నెలల వరకు 12శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తారు. విత్తనం వేసే సమయంలో ధరలు అధికంగా ఉన్నా.. పంట చేతికొచ్చే సమయానికి పడిపోతుంటాయి. అప్పుడు పంటను తెగనమ్ముకోకుండా.. మార్కెట్‌ కమిటీ- పరిధిలోని గోదాముల్లో నిల్వ చేసుకుని దానిపై రుణం తీసుకునే వెసులుబాటు- ఈ పథకం ద్వారా లభిస్తుంది. ధర బాగున్నప్పుడు అమ్ముకుని రుణం తీర్చేయొచ్చు.

గతంలో రైతులు తమకు దగ్గరలోని మార్కెట్‌ కమిటీ- గోదాముల్లో వరి, పప్పుధాన్యాలు, చిరు ధాన్యాలు, నూనెగింజల పంటలను నిల్వ చేసి రుణాలు తీసుకునేవారు. ప్రారంభంలో రైతులకు రుణాలు బాగానే ఇచ్చేవారు. తర్వాత మార్కెట్‌ కమిటీ- నిధుల్ని ఇతర అవసరాలకు మళ్లిస్తూ.. కేటాయింపులు తగ్గించారు. 2017-18లో 3,238 మంది రైతులకు 54.08 కోట్లు-, 2018-19లో 40.51 కోట్ల రుణం ఇచ్చారు. తర్వాత అసలు అమలే నిలిపేశారు.పంట ఉత్పత్తుల అమ్మకాలపై మార్కెట్‌ కమిటీ-లు 1శాతం రుసుము వసూలు చేస్తాయి. ఉద్యోగుల జీతాలు, రైతుబంధుకు అవసరమయ్యే నిధుల్ని వాటినుంచే కేటాయించేవారు. 2019 నుంచి వీటిని నిలిపేశారు. సంస్కరణల పేరుతో రైతులు పంట ఉత్పత్తులను గోదాముల్లో నిల్వ చేసుకునేందుకూ చోటివ్వడం లేదు. అద్దెల ద్వారా వచ్చే ఆదాయమే ముఖ్యం అన్నట్లు-గా వ్యవహరిస్తోంది. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ-లను రాజకీయ పునరావాసాలుగా మార్చిన ప్రభుత్వం.. అన్నదాతలకు వాటిని దూరం చేసిందని రైతుసంఘాల నేతలు విమర్శిస్తున్నారు.

రైతులకు మార్కెట్‌ కమిటీ- నిధుల నుంచి వడ్డీలేని రుణం ఇవ్వడానికి.. నాలుగేళ్లుగా ప్రభుత్వం శ్రద్ద చూపడం లేదనే విమర్శలు వున్నాయి. పంట ఉత్పత్తులపై మార్కెట్‌ రుసుము రూపంలో ఏడాదికి 500 కోట్లకు పైగా ఖజానాలో జమ చేసుకుంటు-న్నా.. అందులోనుంచి అప్పుగానే ఏడాదికి 100 కోట్లు- ఇచ్చేందుకూ ససేమిరా అంటోంది. ఏడాదికి మూడు విడతలుగా ఇచ్చే 7 వేల500 రూపాయల రైతు భరోసాతో సరిపెట్టు-కోవాలంటూ ‘రైతుబంధు’ పథకాన్ని అటకెక్కించింది. వ్యాపారుల వద్ద పెట్టు-బడి కోసం రైతులు అధిక వడ్డీకి అప్పు తెచ్చుకుని సాగు చేస్తున్నా.. తమకేమీ పట్టనట్లే ప్రభుత్వం చోద్యం చూస్తోందని అన్నదాతలు పెదవి విరుస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement