Thursday, May 9, 2024

Samarlakota – చంద్ర‌బాబు, ప‌వ‌న్ ల‌పై విరుచుకుప‌డ్డ జ‌గ‌న్…వ‌ల‌స నేత‌లంటూ విమ‌ర్శ

సామ‌ర్ల కోట : వైఎస్ఆర్ సిపి అధినేత‌, ఎపి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మ‌రోసారి చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ ల‌పై విరుచుకుప‌డ్డారు.. ఈ ఇద్దరి నేత‌ల‌పై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేశారు.. ”చంద్రబాబు, ఆయనను సమర్థించే నాయకులెవరూ ఏపీలో ఉండరు. ఆయన దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌ ఇల్లు కూడా హైదరాబాద్‌లోనే. కానీ, ఆ ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3 – 4 ఏళ్లకోసారి మారుతూ ఉంటారు. ఒకసారి లోకల్‌.. ఇంకోసారి నేషనల్‌.. మరోసారి ఇంటర్నేషనల్‌. ఆడవాళ్లన్నా.. పెళ్లిళ్ల వ్యవస్థ అన్నా.. పవన్‌కు గౌరవం లేదు” అని జగన్ అన్నారు.

సామర్లకోటలో వైఎస్ఆర్ జగనన్న కాలనీలో లబ్దిదారులకు సీఎం జగన్ గురువారం నాడు ఇళ్లను అందించారు.లబ్దిదారులతో కలిసి సామూహిక గృహా ప్రవేశాలను చేయించారు జగన్. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం జగన్ ప్రసంగిస్తూ, చంద్రబాబు ముఖం చూస్తే స్కాంలు, అవినీతి, జన్మభూమి కమిటీలు గుర్తుకు వస్తాయని చెప్పారు. తన ముఖం చూస్తే పేద ప్రజలకు అమలు చేసే స్కీంలు గుర్తుకు వస్తాయని సీఎం జగన్ చెప్పారు.చంద్రబాబు పేరు చెబితే గజదొంగల ముఠా, పెత్తందారి అహంకారం గుర్తొస్తుందన్నారు. 14 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పేదలకు ఇళ్లు ఎందుకు ఇవ్వలేకపోయారని ఆయన ప్రశ్నించారు.

ఈ 52 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు ఒక నెల పాటు కంటిన్యూగా రాష్ట్రంలో కన్పించాడా అని సీఎం జగన్ ప్రశ్నించారు. కానీ ఇప్పుడు రాజమండ్రిలో కన్పిస్తున్నాడని సెటైర్లు వేశారు. .చంద్రబాబుకు,దత్తపుత్రుడికి, చంద్రబాబు తనయుడికి, చంద్రబాబు బావమరిదికి ఏపీలో ఇళ్లు లేదన్నారు. చంద్రబాబు ఇళ్లు పక్క రాష్ట్రంలోని హైద్రాబాద్ లో కన్పిస్తుందన్నారు. రాష్ట్ర ప్రజల పట్ల బాబుకు ఉన్న అనుబంధం ఇదే అని జగన్ చెప్పారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో కూడ పేదలకు ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం చంద్రబాబు చేయలేదని ఆయన విమర్శించారు. కానీ తమ ప్రభుత్వ హయంలోనే కుప్పంలో ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణాలు చేసినట్టుగా జగన్ గుర్తు చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలిస్తే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని కోర్టుకు వెళ్తారని చంద్రబాబుపై జగన్ మండిపడ్డారు. ప్రభుత్వం ఎంత మంచి చేసినా మంటలు పెట్టి కుట్రలు చేస్తున్నారన్నారు.నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు కూడ అనలేరని బాబు తీరుపై విమర్శలు చేశారు.కష్టమొచ్చినా, నష్టమొచ్చినా నిలబడే వాడే నాయకుడన్నారు.రాష్ట్రంలోని 87 శాతం ఇళ్లకు సంక్షేమ పథకాలను అందిస్తున్నామని జగన్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement