Sunday, October 6, 2024

TS | ఈసీ బ‌దిలీ చేసిన పోస్టుల‌కు.. ప్యానెల్ పంపిన రాష్ట్ర ప్ర‌భుత్వం

ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ తెలంగాణ‌లోని ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల‌ను బ‌దిలీ చేసిన పోస్టుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్యానెల్ పంపింది. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున పేర్ల‌ను ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఇవ్వాల (గురువారం) పంపారు. ఇందులో న‌లుగురు క‌లెక్ట‌ర్లు, ముగ్గురు సీపీలు, 10 మంది ఎస్పీ పోస్టుల‌కు, ర‌వాణా, ఎక్సైజ్, వాణిజ్య ప‌న్నుల శాఖ‌ల కార్య‌ద‌ర్శుల పోస్టుల‌కు, ఎక్సైజ్, వాణిజ్య ప‌న్నుల క‌మిష‌న‌ర్ల పోస్టుల‌కు ప్యానెల్ పంపారు.

కాగా, ప్యానెల్ నుంచి ఒక్కొక్క‌రిని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎంపిక చేయ‌నుంది. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ర్టాల్లో కేంద్ర ఎన్నికల కమిషన్‌ భారీ ఎత్తున సీనియర్‌ అధికారులను బదిలీ చేసింది. బదిలీ అయిన వారిలో కలెక్టర్లు, పోలీస్‌ అధికారులు ఉన్నారు. తెలంగాణలో రంగారెడ్డి, మేడ్చ‌ల్‌ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, నిర్మల్‌ జిల్లాల కలెక్టర్లతో పాటు మ‌రో 13 మంది పోలీసు అధికారులు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement