Tuesday, May 7, 2024

పల్లె నుండి పరదేశానికి ఎంపికైన ఆణిముత్యం

మండల పరిధిలోని చిన్న పల్లెటూరు నుండి శ్రీలంకలో జరిగే ట్వంటీ-20 క్రికెట్ పోటీలకు చిగురుపాటి ధవళ వరుణ్ ఎంపికయ్యారు. జానకీ పురం గ్రామానికి చెందిన చిగురుపాటి ధవళ వరుణ్ (24) జనవరి 2022 లో శ్రీలంకలో ఆసియన్ అమెథ్యూర్ 20 – 20 క్రికెట్ అసోసియేషన్ వారు నిర్వహించే ఇండియా – శ్రీలంక టి20 సిరీస్ కు అమరావతి క్రికెట్ అసోసియేషన్ (ఆంధ్ర ప్రదేశ్) తరపున పాల్గొననున్నారు. ఈ క్రికెట్ పోటీల్లో ముఖ్యంగా భారతదేశం నుండి సౌత్ ఇండియా కు చెందిన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన 11 మంది క్రికెట్ క్రీడాకారులు తో పాటు మరో నలుగురు క్రికెటర్లు ఈ శ్రీలంక ఇండియా సిరీస్ లో పాల్గొనబోతున్నారు. ఈ 15 మందిలో ఆంధ్ర ప్రదేశ్ నుండి చిగురుపాటి వరుణ్ ఆల్రౌండర్ ప్రతిభతో ఈ సీరీస్ క్రికెట్ కు ఎంపికయ్యారు. గత రెండు నెలల క్రితం ఈ సిరీస్ కు సెలక్షన్స్ జరుగగా వరుణ్ అన్ని విభాగాల్లో ప్రతిభ కనబరిచి ఎంపిక కాగా, అనంతరం తమిళనాడులో జరిగిన సెలక్షన్స్ పోటీల్లో కూడా సెలెక్టర్ లను వరుణ్ ఆకట్టుకున్నారు. దీంతో జనవరి చివరి ఈ మాసంలో శ్రీలంకలో జరిగే ఈ సిరీస్ కు భారత దేశం నుండి టీంతో కలిసి వరుణ్ వెళ్లనున్నారు. పెడన నందమూరు లోని వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ ను వరుణ్ పూర్తి చేశారు. వరుణ్ తండ్రి రాజారత్నం పాస్టర్ కాగా, తల్లి రజిని కుమారి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. సాధారణ పల్లెటూరు వాతావరణం నుండి ప్రపంచంలోనే అత్యంత పోటీ వాతావరణం ఉన్న క్రికెట్లో స్థానం సంపాదించి మరింత ప్రతిభ కనబర్చెందుకు వరుణ్ సిద్ధమవుతున్నారు. అలాగే మండలంలోని పలువురు ప్రముఖులు వరుణ్ కుటుంబ సభ్యులను ప్రోత్సహించి అభినందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement