Tuesday, April 30, 2024

APSRTC: మాస్క్ లేకుండా బస్ ఎక్కితే ఫైన్.. ఎంతో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కేసులు రోజురోజుకీ అధికం అవుతున్నాయి. ప్రస్తుతం సంక్రాంతి పండుగ సీజన్ కావడంతో ప్రజలు ప్రయాణాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కేసులు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేసింది. మాస్క్ లేకుండా బస్ ఎక్కే ప్రయాణికులకు రూ. 50 జరిమానా విధిస్తున్నారు.

టికెట్ ధరతో పాటు ఈ జరిమానాను కూడా టికెట్ రూపంలో ఇవ్వనున్నారు. కండక్టర్ల వద్ద ఉండే టికెట్ మిషన్లలో కూడా ఇప్పటికే ఈ రూ. 50 జరిమానాను అప్ డేట్ చేశారు. ఫైన్ బటన్ నొక్కగానే రూ. 50 జరిమానా టికెట్ వస్తుంది. ఆర్టీసీ బస్సుల ద్వారా కరోనా వ్యాప్తి జరగకూడదనే జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ జరిమానా నిర్ణయం తీసుకున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement