Friday, December 6, 2024

AP : కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి…

కృష్టా జిల్లాలో ఇవాళ తెల్ల‌వారు జామునా రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. గ‌న్న‌వ‌రం మండ‌ల ప‌రిధిలోని వీర‌ప్ప‌నేని గూడెం వ‌ద్ద ఆటో బోల్తాప‌డింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతి చెందారు. మ‌రో 18మందికి గాయాల‌య్యాయి.

మండల కేంద్రం నుంచి వీరప్పనేని గూడెంకు వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 18 మందికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం బంధువులకు అప్పగించనున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement