Friday, April 26, 2024

రియల్ హీరోస్: కరోనా వేళ వెల్లివిరిసిన మానవత్వం..

కరోనా మహమ్మారి బంధాలను బంధుత్వాలను దూరం చేస్తోంది. సొంతవారిని కూడా దగ్గరకు రాకుండా భయపెడుతుంది. మృతదేహాలను చూసేందుకు కూడా భయపడేలా చేస్తుంది. బంధువులు ఎందరు ఉన్నా కొందరు కరోనా బాధితులు అనాథలుగా మిగిలిపోతున్నారు. ఎవరు దగ్గరికి రాకపోవడంతో మానవత్వం కలిగిన వారు అంత్యక్రియలు చేస్తున్నారు. ఇటువంటి ఘటనే శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.

అనాధ, పేద, కోవిడ్ మృతదేహాల దహన సంస్కారాలలో రెడ్ క్రాస్ వాలంటీర్స్ ఆదర్శంగా నిలుస్తున్నారు. కోవిడ్ సమయంలో బంధువులు సైతం దహన సంస్కారాలకు ముందుకు రాని పరిస్థితి చూస్తున్నాం. అయితే తాము సైతం అంటూ ముందుకు వస్తూ సమాజ సేవ ముఖ్యం అని నిరూపిస్తున్నారు రెడ్ క్రాస్ వాలంటీర్లు. కోవిడ్ బారిన పడిన వాలంటీర్లు కూడా ఏ మాత్రం వెనుకంజ వేయకుండా సమాజ సేవలో ముందున్నారు. గురువారం శ్రీకాకుళం నగర పరిధిలో 70 సంవత్సరాల అనాధ వృద్దుడు మరణించాడు.

అనారోగ్యంతో బాధపడుతూ రెడ్ క్రాస్ సంస్థ రోజు అందించే భోజనంతో జీవనం సాగించేవాడు. అయితే, గురువారం వృద్ధుడు మరణించడంతో కోవిడ్ రెస్పాన్స్ టీం మృత దేహహాన్ని స్మశాన వాటికకు తరలించి దహన సంస్కారాలు నిర్వహించారు. అంతేకాదు ఫాజుల్ బేగ్ పేట, రెడ్డికవీధికి చెందిన 82 సంవత్సరాల వయస్సు గల సత్యవతమ్మ, బ్యాంకర్స్ కాలనీకి చెందిన అర్ .సరోజినమ్మ(70), రణస్థలం మండలం పిసిని గ్రామానికి చెందిన రెడ్డి, ఇలా పలువురి మృతదేహాలను కూడా రెడ్ క్రాస్ వాలంటీర్లు దహన సంస్కారాలు నిర్వహించారు.

ఇది కూడా చదవండి: ఈటలపై ఆత్మగౌరవ దాడి.. ఐక్య వేదికగా ఉద్యమం!

Advertisement

తాజా వార్తలు

Advertisement