Wednesday, March 27, 2024

కరోనాతో సమ్మక్క-సారలమ్మ పూజారి మృతి

మేడారం వన దేవతలు సమ్మక్క, సారలమ్మలను నిత్యం పూజించే అర్చకుడు సిద్దబోయిన సమ్మారావు (47) కరోనా బారిన పడి గురువారం నాడు మృతి చెందారు. నెలరోజుల కిందట కరోనా పాజిటివ్ రావడంతో హోం క్వారంటైన్‌లో ఉండి కోలుకున్నారు. ఇటీవల తీవ్రమైన అనారోగ్య సమస్యతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సమ్మారావు గురువారం తుదిశ్వాస విడిచారు. కాగా సమ్మారావు భార్య సృజనా కూడా కొన్నిరోజుల కిందట కరోనా సోకి చనిపోయారు. ఈ ఘటనతో మేడారంలోని సమ్మారావు నివాసంలో విషాదం నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement