Thursday, May 2, 2024

Womens Day Special : అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మగువలు

- Advertisement -

మగువ.. సృష్టికి మూలం. అవనిలో సగం.. ఆకాశంలో సగం.. కానీ, అవకాశాల్లో మాత్రం అంతగా అందుకోవడం లేదు. కొన్ని చోట్ల మగాళ్లతో పోటీ పడుతున్నా.. ఇంకొన్ని రంగాల్లో వివక్ష క‌నిపిస్తోంది. అయినా.. కొంత‌మంది యువతులు దూసుకుపోతూ తమ సత్తా నిరూపించుకుంటున్నారు. మహిళల గొప్పతనాన్ని తెలియజేసేలా, మహిళా సాధికారతకు పట్టం కట్టేలా ఏటా మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాం. ఈ ఏడాది కొత్త థీమ్తో ఈ వేడుకలు జరుగుతున్నాయి. గతేడాది వివక్షను బద్దలు కొట్టి లింగసమానత్వాన్ని పెంపొందించండి అనే థీమ్‌తో నిర్వహిస్తే.. ఈ సారి లింగ సమానత్వంతో పాటు ప్రతి చోట మహిళలతో కూడిన సమ్మిళిత ప్రపంచాన్ని సృష్టించడాన్ని అనే ప్రచార థీమ్‌ని ఎంచుకున్నారు.

మహిళల్లో స్ఫూర్తి నింపే సరికొత్త థీమ్‌తో మహిళా దినోత్సవం తల్లిగా, చెల్లిగా, భార్యగా, స్నేహితురాలిగా, కష్టాల సమయంలో ఆత్మీయ నేస్తంగా, ఉద్యోగ, వ్యాపారాలలో తమకు తామే సాటిగా దూసుకుపోతున్న మహిళల గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే. అటువంటి మహిళల గొప్పతనాన్ని చెప్పుకోవటానికి మహిళా దినోత్సవం ఒక వేదిక అని చెప్పొచ్చు. కార్మిక ఉద్యమం నుండి పుట్టిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మహిళలకు సంబంధించిన ఒక కొత్త అంశాన్ని ప్రపంచానికి తెలియ చెప్పడానికి ప్రయత్నం చేస్తోంది. మహిళలకు పట్టం కట్టే ఒక సరికొత్త థీమ్‌తో ప్రతి సంవత్సరం మహిళల గొప్పతనాన్ని తేటతెల్లం చేస్తుంది.

ఆర్థిక స్వావలంబన..
మహిళా దినోత్సవం ఈ ప్రయత్నంలో భాగమే దాదాపు శతాబ్ద కాలానికి ముందు నుంచే ప్రపంచవ్యాప్తంగా మహిళలందరి కోసం ప్రత్యేకమైన రోజుగా మార్చి ఎనిమిదవ తేదీని గుర్తించి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మహిళల సమస్యల పైన, మహిళా సాధికారతపైన దృష్టిసారించేలా, మహిళలు అనేక రంగాలలో ఆర్థిక స్వావలంబన సాధించేలా జరుగుతున్న ప్రయత్నానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఊతమిస్తుంది.

మహిళలతో కూడిన సమ్మిళిత ప్రపంచాన్ని సృష్టించాలి:
2024 థీమ్ ఇదే.. గతేడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం వివక్షను బద్దలు కొట్టి లింగసమానత్వాన్ని పెంపొందించండి అనే థీమ్‌తో నిర్వహిస్తే, ఈ సంవత్సరం లింగ సమానత్వం మాత్రమే కాదు ప్రతి చోట మహిళలతో కూడిన సమ్మిళిత ప్రపంచాన్ని సృష్టించడాన్ని ప్రచార థీమ్‌గా నిర్ణయించారు. స్థిరమైన రేపటి కోసం, మహిళా సాధికారత కోసం చేయాల్సిన ఎన్నో పనులను దిశనిర్దేశం చేస్తున్న ఐక్యరాజ్యసమితి, ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లింగ సమానత్వంపై దృష్టి సమాజం యొక్క డిఎన్ఏ లో భాగం కావాలని ఈసారి మహిళలకు సమాన అవకాశాలు ఎందుకు లేవు? మహిళలతో కూడిన సమ్మిళిత ప్రపంచాన్ని సృష్టించాలి అనే థీమ్ తో ప్రచారాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

స్ఫూర్తి నింపేందుకే ప్రత్యేక కార్యక్రమాలు
మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన అవసరం ఇదే.. అసలు మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన అవసరం ఏమిటి అంటే.. మహిళల్లో నిబిడీకృతమై ఉన్న శక్తిని బయటకు తీయడమే కాకుండా, మహిళా చైతన్యాన్ని, మహిళలు సాధించిన విజయాలను, పదిమందికి తెలియచేసి, వారిలో స్ఫూర్తి నింపి ముందుకు నడిపించడం అని చెప్పుకోవడం. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మహిళలు సాధించిన ఎన్నో విజయాలు, వారి గొప్పతనాన్ని మహిళా దినోత్సవం వేదికగా చెప్పడం వల్ల అది ప్రతి ఒక్కరిలో కావలసిన ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. అంతేకాదు భవిష్యత్తులో వారు సాధించాల్సిన అనేక విషయాలపై మహిళా దినోత్సవం చేస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement