Sunday, May 5, 2024

Weather Report: ఏపీకి వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే 24 గంటల్లో అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బీహార్ నుంచి ఉత్తర తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉండడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు.
ద్రోణి ప్రభావంతో బంగాళాఖాతం నుంచి మధ్య భారతం వైపుగా తేమ గాలులు వీస్తున్నాయి. ఫలితంగా కోస్తాలో పలుచోట్ల దట్టంగా మేఘాలు ఆవరించాయి. దీంతో పగటి ఉష్ణోగ్రతల్లో ఒకటి రెండు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. అనంతపురంలో అత్యధికంగా 33.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement