Monday, May 20, 2024

Pushpa too – ప‌వ‌న్ క‌ల్యాణ్ కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన అల్లు అర్జున్

ప‌వ‌ర్ స్టార్ , జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు రాజకీయ మద్దతు తెలిపే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోం ది. పిఠాపురం ప్రజలు పవన్‌ను గెలపించాలని కోరుతూ అగ్ర కథానాయకుడు చిరంజీవి వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా జ‌న‌సేనానికి త‌న మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఎక్స్ (ట్విట‌ర్‌) వేదిక‌గా ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తు తెలుపుతూ బ‌న్నీ ప్ర‌త్యేకంగా ఓ ట్వీట్ చేశాడు.

- Advertisement -

“మీ ఎన్నిక‌ల ప్ర‌యాణానికి నా హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు. సేవ కోసం మీ జీవితాన్ని అంకితం చేయ‌డాన్ని చూసి గ‌ర్విస్తున్నాను. ఒక కుటుంబ స‌భ్యుడిగా నా మ‌ద్ద‌తు మీకు ఎప్పుడూ ఉంటుంది. మీరు కోరుకున్న‌ది సాధించాల‌ని ఆకాంక్షిస్తున్నా” అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఐకాన్ స్టార్ అభిమానులు కూడా ప‌వ‌ర్ స్టార్‌కు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. .

Advertisement

తాజా వార్తలు

Advertisement