Sunday, April 28, 2024

Proddutur – ఆకృతి రెడీమేడ్ షోరూంలో అగ్ని ప్రమాదం

కడప ప్రతినిధి- ప్రభ న్యూస్వైయస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం కొర్రపాడు రోడ్డులోని ఆకృతి రెడీమేడ్ షో రూమ్ లో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ మంటలు అదుపులోకి రావడం లేదు. మేఘాలను తలపించేలా నల్లటి పొగ వ్యాపించటంతో అద్దాలను పగల కొట్టేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా మరేదైనా ఇతర కారణాలు ఉన్నాయా అన్నది తెలియ రావలసి ఉంది. అయితే భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. గడచిన నాలుగైదు రోజుల నుండి రానున్న వేసవికాలం నేపథ్యంలో ఏసీలు సర్వీసింగ్ చేయించుకుంటూ ఉన్న యాజమాన్యం. అయితే ప్రమాదానికి కారణం ఏమిటన్నది స్పష్టంగా తెలియడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement