Saturday, May 4, 2024

వార్డు అభివృద్ది కి సమిష్టి కృషి..

మార్కాపురంటౌన్ : పట్టణంలోని వార్డుల అభివృద్దికి సమిష్టి కృషి అవసరమని మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌, 17వబ్లాక్‌ కౌన్సిలర్‌ షేక్‌. ఇస్మాయిల్‌ పేర్కొన్నారు. పట్టణంలోని భగత్‌సింగ్‌ కాలనీలోని 10వ వార్డు సచివాలయం సిబ్బంది, వాలంటీర్లతో పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 16,17 వార్డు కౌన్సిలర్లు దారివేముల హర్షితబాబి, షేక్‌. ఇస్మాయిల్‌లు హాజరయ్యారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ వార్డుల అభివృద్దికి సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల సమిష్టి సహకారం ఎంతో అవసర మని వారు పేర్కొన్నారు. అందరూ సమిష్టి బాధ్యతతో పనిచేసి వార్డును అభివృద్దిలో ఉంచాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయ అడ్మిన్‌ గరికపాటి మహాలక్ష్మి, సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement