Friday, May 3, 2024

పత్యేక అలంకరణలో వెంకటేశ్వరస్వామి..

కొనకనమిట్ల : మండలంలోని గార్లదిన్నె పంచాయితీలోని వెలుగొండ క్షేత్రంలో కొలువైన లక్ష్మీ అలివేలుమంగసమేతశ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం ధ్వజస్థంభానికి పూజలు నిర్వహించి ధ్వజపటాన్ని ఇ.ఓ ఈదుల చెన్నకేశవరెడ్డి, చైర్మన్‌ సానికొమ్ము తిరుపతిరెడ్డి, ఆలయ ధర్మకర్తల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అర్చకులు నంద్యాల ప్రసాదాచార్యులు, కొడవటిగంటి వెంకటచార్యులు, శ్రీపతి అప్పనాచార్యులు, తిరుమలాచార్యుల ఆధ్వర్యంలో మంత్రోచ్చారణలతో పూజలు నిర్వహించారు. శ్రీవారిని ప్రత్యేకంగా పూలమాలలతో అలంకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement