Sunday, May 19, 2024

సబ్‌ కలెక్టర్‌ కు సమస్యలను వివరిస్తున్న శివరాం..

కందుకూరు టౌన్‌ : గుడ్లూరు మండలంలోని చేవూరు గ్రామంలో యస్‌.సి కాలనీ వాసులు గత కొన్ని సంవత్సరాలుగా కమ్యూనిటీ అవసరాల కోసం 18 సెంట్ల భూమిని వాడుకుంటున్నారు. 18 సెంట్ల స్థలంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ పేరుతో స్మృతివనం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ స్థలం అంబేద్కర్‌ స్మృతి వనానికి కేటాయించాలని యస్‌.సి కాలనీ వాసులు కోరారు. ఆ స్థలంలో మరొక యస్‌.సి కాలనీ వాసులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ప్రభుత్వం ఇచ్చే ఇళ్ళపట్టాలకు మేము వ్యతిరేకులం కాదు. కానీ యస్‌.సి కాలనీకి తూర్పు వైపు 3 ఎకరాల ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది. ఆ స్థలంలో ఇళ్ళపట్టాలు ఇస్తే బాగుంటుందని తెలిపారు. యస్‌.సి కాలనీలో కూడా అర్హులైన పేదలకు ఇళ్ళస్థలాలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సబ్‌ కలెక్టర్‌ భార్గవ తేజను మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ దివి శివరాం కోరారు. అలాగే కందుకూరు మండలంలోని జి.మేకపాడు గ్రామంలో ప్రజలు, పశువులు తాగు నీటికోసం గత 10 సంవత్సరాల క్రితం ప్రభుత్వ భూమిలో బోరు ఏర్పాటు చేసుకొని నీటి సమస్య లేకుండా చేసుకుంటున్న తరుణంలో ఆ గ్రామాన్ని సందర్శించిన తహశీల్దారు సీతారామయ్య ఆ స్థలంలో పాల కేంద్రం నిర్మించాలని మంచినీళ్ళు బోరు తొలగించాలనే ప్రయత్నం విరమింపచేసేలా ఆదేశాలు ఇవ్వాలని సబ్‌ కలెక్టర్‌ భార్గవ తేజను కోరారు. దీనికి స్పందించిన సబ్‌ కలెక్టర్‌ తహశీల్దారుతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యస్‌.సి సెల్‌ జిల్లా కార్యదర్శి గోచిపాతల మోషే, విశ్వనాధపురం సర్పంచ్‌ బొల్లినేని నాగేశ్వరరావు, భూమి సమస్య బాధితులు కొండపనాయుడు, వెంకటరాణమ్మ, చేవూరు యస్‌.సి కాలనీ వాసులు గోచిపాతల బెన్నియ్య, చేవూరి రాజగోపాల్‌, సిపిఐ నాయకులు పోకూరి మాలకొండయ్య, పి.బాలకోటయ్య, బి.సురేష్‌, సిపిఎం నాయకులు జివెంకటేశ్వర్లు, జివిబి కుమార్‌ తదితరుల పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement