Monday, May 13, 2024

ఒంగోలులో 4వ కేంద్రాన్ని ప్రారంభించిన ఒయాసిస్ ఫెర్టిలిటీ

భారతదేశంలోని ప్రముఖ సంతానోత్పత్తి గొలుసుకట్టు ఐవిఎఫ్ కేంద్రాలలో ఒకటైన ఒయాసిస్ ఫెర్టిలిటీ, అత్యాధునిక పూర్తి స్థాయి ఐవీఎఫ్ కేంద్రాన్ని ఒంగోలులో నూతనంగా ప్రారంభించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో తన విస్తరణను ప్రకటించింది. ఈ కేంద్రాన్ని ముఖ్య అతిథిగా హాజరైన నల్లూరి నర్సింగ్ హోమ్, డైరెక్టర్, ఎఫ్ ఓజీఎస్ఐ మాజీ అధ్యక్షుడు, డాక్టర్ నల్లూరి అరుణ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఒయాసిస్ ఫెర్టిలిటీ విజయవాడ క్లినికల్ హెడ్ డాక్టర్ సుజాత వెల్లంకి, ఒయాసిస్ ఫెర్టిలిటీ, ఒంగోలు, కన్సల్టెంట్ అండ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ దీపికా బొప్పన, ఒయాసిస్ ఫెర్టిలిటీ, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, సుధాకర్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా విజయవాడ క్లినికల్ హెడ్ డాక్టర్ సుజాత వెల్లంకి మాట్లాడుతూ.. ఒంగోలులో అడుగు పెడుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. వివిధ కారణాల వలన సంతానలేమి సమస్య క్రమంగా పెరుగుతుండటంతో, సంతానలేమి సమస్యకు వ్యవస్థీకృత, వృత్తిపరమైన నిపుణుల అవసరం చాలా కీలకంగా మారిందన్నారు. త‌మ సాంకేతిక-ఆధారిత విధానం స్థిరంగా ఉంటూ అధిక విజయ రేట్లను అందించడంలో త‌మకు సహాయపడిందన్నారు.

ఒయాసిస్ ఫెర్టిలిటీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధాకర్ జాదవ్ మాట్లాడుతూ… ప్రపంచ నలుమూలల నుండి తాజా సాంకేతికతలను అందిపుచ్చుకుంటూ నిరంతరం చికిత్సను నవీకరించడంలో, గ్రహించడంలో త‌మ అవిశ్రాంత ప్రయత్నాలు అంతర్జాతీయ ప్రమాణాలకుసరిసమానంగా సంతానోత్పత్తి చికిత్సలను అందించడంలో త‌మకు సహాయపడిందన్నారు. ఒయాసిస్ ఫెర్టిలిటీ, ఒయాసిస్ ఫెర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, డాక్టర్ దీపికా బొప్పన మాట్లాడుతూ… ఒయాసిస్ ఫెర్టిలిటీ గత 12 సంవత్సరాలుగా హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో సంతాన సాఫల్య సంరక్షణను అందిస్తోందన్నారు. పిల్లలు లేని జంటలకు తక్కువ ధరలకు సమగ్ర సేవలను అందిస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement