Tuesday, May 14, 2024

Power of Police – ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నిస్తే అరెస్ట్ లు, థర్డ్ డిగ్రీ ప్రయోగం

చంద్రగిరి ,జులై 15 (ప్రభ న్యూస్): ఇసుకను తరలించకూడదని సుప్రీంకోర్టు గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పును సమర్ధించి రాష్ట్ర ప్రభుత్వ అప‌్పీల్ ను కొట్టివేసిన నేపథ్యంలో చంద్రగిరి మండలం రెడ్డివారిపల్లె స్వర్ణముఖి రీచ్ నందు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న గుత‌్తదారులను అడ్డుకున్న పాపానికి 21 మంది స్థానికుల పైన పోలీసులు కేసులు నమోదు చేసారు. అందులో ఇద్దరిని ఎవరికి తెలియకుండా పట్టుకుని పోలీసు వాహనంలో తిప్పుతూ థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఈ విషయాన్ని నిరసిస్తూ చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నాని సతీమణి వివతి సుధా రెడ్డి తో కలిసి భారీ ఎత్తున నాయకులు కార్యకర్తలు చంద్రగిరి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు

. వివరాలకెళితే ఇలా ఉన్నాయి…. స్వర్ణముఖి నది నుంచి గుత్తేదారులుగా చెప్పుకుంటున్న జయప్రకాష్ పవర్ వెంచర్ లిమిటెడ్ వారు కోట్లాది రూపాయల ఇసుకను అక్రమంగా తరలించకపోతుండటంతో స్థానికులు పలు గ్రామాల వారు కలిసి అడ్డుకున్నారు అడ్డుకున్న వారిలో చురుకైన యువకులను గుర్తించి వారిపైన చంద్రగిరి డి.ఎస్.పి డాక్టర్ యశ్వంత్ ఆదేశాల మేరకు సీఐ చిరంజీవి 21 మంది పైన కేసు నమోదు చేశారు.

Vaccination గ్రామానికి చెందిన వళ‌్లూరి శ్రీకాంత్ అనే యువకుడు పొలం వద్ద పశువులను మేపుకుంటుండగా కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా పోలీసులు తరలించారు. అదేవిధంగా తొండవాడ గ్రామానికి చెందిన బెంగాలి మణియాదవ్ గొర‌్రెలను మేపుకుంటుండగా ఎవరికి తెలియకుండా పోలీస్ వాహనాలు ఎక్కించుకొని తిరుపతి పట్టణమంతా తిప్పుతూ హింసించినట్లు తెలుసుకొని స్థానికులతో కలిసి టిడిపి నాయకులు చంద్రగిరి పోలీస్ స్టేషన్ నందు ధర్నా నిర్వహించారు.

చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన చంద్రగిరి, రామచంద్రాపురం, పాకాల ,తిరుపతి రూరల్, యర్రావారిపాలెం, చిన్నగొట్టిగల్లు మండలాల నుంచి వందలాదిమంది ఈ ధర్నాలో పాల్గొన్నారు తిరుపతి జిల్లాలోని పోలీస్ స్టేషన్లో నుంచి పోలీసుల బలగాలను చంద్రగిరి కి రప్పించారు.అరెస్టు చేసిన యువకులను విడుదల చేయాలి అని పులివర్తి సుధా రెడ్డి పోలీసులను కోరారు. సిఐ రాజశేఖర్ మాట్లాడుతూ తన పరిధిలో ఏమీ లేదని చెప్పారు దీంతో ఆమె చంద్రగిరి డి.ఎస్.పి యశ్వంత్ తో ఫోన్లో మాట్లాడారు ఆయన మహిళ అని చూడకుండా దురుసుగా సమా సమాధానం చెప్పడంతో కార్యకర్తలు మరింత ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా 41 నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా అరెస్టు చేయడం పలు విమర్శలకు దారితీస్తుంది. అరెస్టు చేసిన యువకులను విడిచి పెట్టేదాకా ధర్నా విరమింప చేసేది లేదని భీష్ముంచుకూర్చున్నారు.

- Advertisement -

స్థానిక శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒత్తిడితోనే తాము యువకులను అరెస్టు చేయాల్సి వచ్చిందని పోలీసులు ప్రకటించడం సిగ్గుచేటని విమర్శిస్తున్నారు. ప్రజా సంక్షేమం కోసం పోలీసులు ఉద్యోగం చేయాలే కానీ రాజకీయ ఒత్తిడి లకు ఉద్యోగాలు చేయటం ఏమిటని ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా కానీ అరెస్టు చేసిన యువకులను వదిలిపెడితే కానీ తాము ఇక్కడి నుంచి కదిలేది లేదన్నారు.అయితే వారికి వైద్య పరీక్షలు నిర్వహింపజేసి , మెజిస్ట్రేట్ ముందు ప‌్రవేశపెట‌్టటాని చర‌్యలు తీసుకుంటున్నట్లు విశ‌్వసనీయంగా అందిన సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement