Sunday, April 28, 2024

AP – టిడిపి నేతల ఇళ్లలో పోలీసుల సోదాలు…

నెల్లూరులో టీడీపీ నేతల ఇళ్లలో పోలీసులు సోదాలు చేశారు. మాజీ మంత్రి నారాయణ ముఖ్య అనుచరుల నివాసాలపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. మాజీ జెడ్పీటీసీ ముప్పాళ్ల విజేతారెడ్డి, వ్యాపారవేత్త గురుబ్రహ్మం నివాసాల్లో తనిఖీలు చేశారు. పోలీసుల సోదాలు విషయం తెలియడంతో.. టీడీపీ మహిళా నేత విజేత రెడ్డి నివాసానికి మాజీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేరుకున్నారు. కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎన్నికల కోడ్ రాకముందే దౌర్జన్యాలు ఎందుకు చేస్తున్నారని కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ నేతలే లక్ష్యంగా దాడులు చేస్తారా?అని ప్రశ్నించారు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్‌ ఉందని.. అన్ని వ్యవస్థలు పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. కాగా, విజేత రెడ్డి ఇంట్లో కేవలం రూ.25వేలు మాత్రమే దొరికినట్లు సమాచారం ..దీనిపై మరింత సమచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement