Monday, April 29, 2024

Modi Wish Jagan: సీఎం జగన్‌కు ప్ర‌ధాని మోడీ విషెస్..ట్విట్టర్ ద్వారా జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. సీఎం జ‌గ‌న్‌కు ప్ర‌ముఖులు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా సీఎం జగన్‌ను విష్ చేశారు.సీఎం జగన్ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. సీఎం జగన్‌ పుట్టిన రోజు సంద‌ర్భంగా భారీఎత్తున సేవా కార్యక్రమాలను వైఎస్సార్‌సీపీ శ్రేణులు చేపట్టాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మొక్కలు నాటడంతో పాటు అన్నదానం, వస్త్రదానాలు చేస్తున్నారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేస్తున్నారు. రక్తదాన శిబిరాలు కూడా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement