Monday, April 29, 2024

మల్లవల్లి రైతులకు పవన్ సంఘీభావం – న్యాయం జరిగే వరకూ అండగా ఉంటాన‌ని హామీ..

హనుమాన్ జంక్షన్(కృష్ణాజిల్లా), ఆగష్టు 6(ప్రభన్యూస్ ) – కృష్ణాజిల్లా, బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో ఇండస్ట్రియల్ కారిడర్ కు భూములు ఇచ్చిన రైతుల సమస్యలను తెలుసుకునేందుకు పవన్ కళ్యాణ్ ఆదివారం మల్లపల్లి విచ్చేశారు. మల్లపల్లి పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే, ఈ ప్రాంత అభివృద్ధి చెందడంతో పాటు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే ఎన్నో ఆశలతో రైతులు తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చారు. భూములు ఇచ్చిన రైతులకు కొంతమందికి నష్టపరిహారం అందగా, మరో 128 మంది రైతులకు నేటికీ పరిహారం అందలేదు. శాసన సభ్యుడు వంశీ మోహన్ కలిసిన రైతులు తమ గోడు విన్నవించుకున్నారు. నే పరిహారం విషయంలో అధికారులతో మాట్లాడి తమ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని రైతులు చెబుతున్నారు. కానీ కొన్ని రోజులకే అధికారులు రైతులపై కేసు లు పెట్టిన పరిస్థితులు నెలకొనడంతో రైతులు నిరసనకు దిగారు. వంట వార్పు కార్యక్రమలు ద్వారా తమ నిరసనను తెలియజేశారు.

గత నెలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను వారహి యాత్రలో మల్లవల్లి గ్రామ రైతులు కలిశారు. ఈ సందర్భంగా రైతులకు భరోసా కల్పించారు. పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో భూములు కోల్పోయి నష్టపరిహారం అందని రైతులకు జనసేన నాయకులు అండగా నిలిచారు. సాగు చేసిన భూమి పోయి, పరిహారం కూడా అందకపోవడంతో రోడ్డున పడ్డామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిహారం అందని బాధిత రైతులకు భరోసా కల్పించేందుకు స్వయంగా మల్లపల్లి గ్రామానికి జనసేన అధినేత పవన్ రావడంతో ఆనందోత్సవాలు వ్యక్తం అయ్యాయి.దీంతో బాధిత రైతులలో ఆశలు చిగురిస్తున్నాయి. రైతులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు రైతులకు అండగా నిలుస్తానని పవన్ ప్రకటించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement