Monday, April 29, 2024

దివ్యాంగులకు ఇంటి వ‌ద్దే పెన్ష‌న్ అంద‌జేయండి – అసెంబ్లీలో బాజీరెడ్డి

నిజామాబాద్ రూరల్ – ఆగస్ట్ 6 ప్రభ న్యూస్ – నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆదివారం తెలంగాణా రాష్ట్ర శాసన సభ సమావేశాల లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో దివ్యాంగుల సమస్యల పై విన్నవించారు. ప్రతీ నియోజక వర్గం లో 4 నుండి 5 వేల మంది ఉన్నారని వారు పడుతున్న కష్టాలను గ్రహించి సీ ఎం కే సీ ఆర్ 3116 నుండి 4116 రూపాయలు చేయడం చాలా సంతోషకరమని ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

దివ్యాంగులు స్వయంగా వెళ్లి వారి పెన్షన్ తీసుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారికి ఇంటికి వెళ్ళి పింఛన్లు అందజేస్తే వారిని అదుకున్న వారిమి అవుతామన్నారు. నియోజక వర్గాల లో చాలా మంది వృద్ధ దంపతులు ఉంటారని భర్తకు లేదా భార్యకు వచ్చే పెన్షన్ వయసు పై బడినవారు మరణించిన అనంతరం బ్రతికున్న వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. బాజిరెడ్డి విజ్ఞప్తి మేరకు మంత్రి ప్రశాంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి దివ్యాంగుల సమస్యలు నోట్ చేసుకొని సీ ఎం దృష్టికి తీసుకెళ్తా మన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement