Sunday, May 12, 2024

Palasa – తమ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై టీడీపీ, జనసేన నాయకులు ఏడుస్తున్నారు – సీఎం జగన్మోహనరెడ్డి

పలాస, డిసెంబర్ 14:దేవుడు దయతో రెండు మంచి కార్యక్రమాలు ఈరోజు జరిగాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కష్టాలు తొలగించేందుకు గాను 700 కోట్ల రూపాయలతో నిర్మించిన వైయస్సార్ సుజల ధార పథకానికి, దాదాపు 80 కోట్ల రూపాయలతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కిడ్నీ రీసెర్చ్ కేంద్రానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన ఇండస్ట్రియల్ పార్కు బాలుర వసతి గృహానికి కూడా శంకుస్థాపన చేశారు అంతకుముందు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. అక్కడ కిడ్నీ వ్యాధితో చికిత్స పొందుతున్న బాధితులను కూడా ఆయన పరామర్శించి వారితో మాట్లాడారు. అనంతరం ఆయన పలాస రైల్వే మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ, ఆరోజు తాను ఈ ప్రాంత ప్రజల బాధలను చూసి అప్పుడే నేను చూశాను నేను ఉన్నాను అని చెప్పానని, ఆ మేరకు తాను చెప్పిన విధంగా 700 కోట్లతో సుజలధార పథకాన్ని, 85 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కిడ్నీ రీసెర్చ్ కేంద్రాన్ని రెండు గొప్ప పనులు పూర్తిచేసుకోగలిగామని ఇది ఎంతో సంతోషకరంగా ఉందని అన్నారు.

కిడ్నీ వ్యాధులకు శాశ్వత పరిష్కారం చూపించే దశగా ఈ పనులు చేపట్టడం జరిగిందని అన్నారు.కనీసం ఊహల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఆలోచించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హిరమండలం రిజర్వాయర్ నుండి పైపులైను ద్వారా 700 కోట్ల రూపాయలతో ఈ సుజల ధార్ పథకాన్ని నిర్మించుకొని ఈరోజు ప్రజలకు అంకితం చేస్తున్నామని ఆయన సగర్వంగా తెలిపారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అత్యాధునిక వైద్య పరికరాలతో కిడ్నీ బాధితులకు వైద్య చికిత్స అందించడం జరుగుతుందని అన్నారు. కిడ్నీ మార్పిడి అనేది ఎవరికైనా చేసే పరిస్థితి ఉంటే ఆ మార్పిడి ఈ ఆసుపత్రిలో చేసి ప్రజలకు మరింత భరోసా కల్పించే విధంగా వైద్య సహాయం అందిస్తామని తెలిపారు. అత్యాధునిక వైద్య పరికరాలు అన్నింటిని ఈ కిడ్నీ ఆసుపత్రిలో సిద్ధంగా ఉంచి కిడ్నీ బాధితులు ఇతర ప్రాంతాలకు పరుగులు తీయకుండా ఈ ప్రాంతంలోనే చికిత్స పొందేటకు అవకాశం ఉందని చెప్పేందుకు తాను ఎంతగానో సంతోషిస్తున్నానని అన్నారు. ఈ ఆసుపత్రిలోదేవుడు దయతో రెండు మంచి కార్యక్రమాలు ఈరోజు జరిగాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు గురువారం శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కష్టాలు తొలగించేందుకు గాను 700 కోట్ల రూపాయలతో నిర్మించిన వైయస్సార్ సుజల ధార పథకానికి దాదాపు 80 కోట్ల రూపాయలతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కిడ్నీ రీసెర్చ్ కేంద్రానికి ఆయన ప్రారంభోత్స‌వం చేశారు అనంతరం ఆయన ఇండస్ట్రియల్ పార్కు బాలుర వసతి గృహానికి కూడా శంకుస్థాపన చేశారు అంతకుముందు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు వివిధ విభాగాలను పరిశీలించారు అక్కడ కిడ్నీ వ్యాధితో చికిత్స పొందుతున్న బాధితులను కూడా ఆయన పరామర్శించి వారితో మాట్లాడారు

అనంతరం ఆయన పలాస రైల్వే మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఆరోజు తాను ఈ ప్రాంత ప్రజల బాధలను చూసి అప్పుడే నేను చూశాను నేను ఉన్నాను అని చెప్పానని ఆ మేరకు తాను చెప్పిన విధంగా 700 కోట్లతో సుజలధార పథకాన్ని 85 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కిడ్నీ రీసెర్చ్ కేంద్రాన్ని రెండు గొప్ప పనులు పూర్తిచేసుకోగలిగామని ఇది ఎంతో సంతోషకరంగా ఉందని ఆయన అన్నారు కిడ్నీ వ్యాధులకు శాశ్వత పరిష్కారం చూపించే దశగా ఈ పనులు చేపట్టడం జరిగిందని అన్నారు కనీసం ఊహల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఆలోచించలేదని ఆవేదన వ్యక్తం చేశారు హిరమండలం రిజర్వాయర్ నుండి పైపులైనంతవర 700 కోట్ల రూపాయలతో ఈ సుజల ధార్ పథకాన్ని నిర్మించుకొని ఈరోజు ప్రజలకు అంకితం చేస్తున్నామని ఆయన సగర్వంగా తెలిపారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక వైద్య పరికరాలతో కిడ్నీ బాధితులకు వైద్య చికిత్స అందించడం జరుగుతుందని అన్నారు కిడ్నీ మార్పిడి అనేది ఎవరికైనా చేసే పరిస్థితి ఉంటే ఆ మార్పిడి ఈ ఆసుపత్రిలో చేసి ప్రజలకు మరింత భరోసా కల్పించే విధంగా వైద్య సహాయం అందిస్తామని తెలిపారు అత్యాధునిక వైద్య పరికరాలు అన్నింటిని ఈ కిడ్నీ ఆసుపత్రిలో సిద్ధంగా ఉంచి కిడ్నీ బాధితులు ఇతర ప్రాంతాలకు పరుగులు తీయకుండా ఈ ప్రాంతంలోనే చికిత్స పొందేటకు అవకాశం ఉందని చెప్పేందుకు తాను ఎంతగానో సంతోషిస్తున్నానని అన్నారు ఈ ఆసుపత్రిలో మొత్తంగా 375 మంది వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు.

ఉద్దానం ప్రాంతంలోని అన్ని పీహెచ్సీలోను ఆటో ఎనలైజర్స్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా ప్రజలకు వైద్యం అందించేందుకు అత్యంత ప్రాధాన్యత కల్పించి ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తున్నామని తెలిపారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు మానవతా దృక్పథంతో ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేపట్టడం జరుగుటన్దని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. డయాలసిస్ చేయించుకునేందుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించేందుకు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించి అందించడం జరిగిందని తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కేవలం 376 మందికి మాత్రమే 2,500 రూపాయిల చొప్పున 76 లక్షలు మాత్రమే నాలుగు సంవత్సరాల అందించారని అన్నారు .తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాలుగున్నరెండుగా 13వేల 146 మందికి నెలకు పదివేల రూపాయలు చొప్పున పెన్షన్ అందించడం జరుగుతోన్దని అన్నారు .ఈ కిడ్నీ రీసెర్చ్ కేంద్రంలో పనిచేసేందుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రీసెర్చ్ కేంద్రాల్లో పని చేస్తున్న వైద్య నిపుణులు ఈ కేంద్రంలో పనిచేసేందుకు గాను ఒప్పందాలు కూడా కుదుర్చుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రకాశం జిల్లాలో కూడా కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేకంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం ఇతర చర్యలు చేపట్టడం జరుగుతోందని తెలిపారు.

- Advertisement -

ఈ కిడ్నీ వ్యాధి ఎందుకు వస్తుందో, దాని మూలాలను తెలుసుకొని ఇందుకు అవసరమైన అన్ని చర్యలు కూడా చేపట్టడం జరుగుతుందని తెలిపారు.ఈ సుజలధార పథకాన్ని దశలవారీగా విస్తరించడానికి అవసరమైన చర్యలు చేపడుతున్నామని, పాతపట్నం నియోజకవర్గంలో 265 కోట్ల రూపాయలతో తాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని, జనవరి నెలలో ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభించడం జరుగుతుందని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ కిడ్నీ వ్యాధి సమస్య ఈ ప్రాంతంలో ఇప్పుడెప్పుడో వచ్చింది కాదని, గన కొన్ని దశాబ్దాలుగా ఈ సమస్య ఉన్నప్పటికీ అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎందుకు నిరోధించే చర్యలు చేపట్టలేదని జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు.మీ బిడ్డగా నాకు ప్రజల బాధలు తెలుసుకునే మనసు ఉంది కాబట్టే ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు.

చంద్రబాబు నాయుడుకు అటువంటి మనసు లేదని దానిని ప్రజలు గుర్తించాలని జగన్మోహన్ రెడ్డి కోరారు.చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పం నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేసుకోలేకపోయారని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కుప్పంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, తన సొంత నియోజకవర్గం అభివృద్ధి చేయలేని చంద్రబాబు నాయుడు ఉద్దానం ప్రాంతాన్ని, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఏ విధంగా ఉద్దరిస్తారని ప్రశ్నించారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఒక్క అభివృద్ధి పని చేసుకున్నట్లుగా చెప్పుకోవడానికి ఏదీ లేదని, తాను ఇచ్చిన హామీల మీద కూడా ఆయన నిలబడలేదని అన్నారు. ఎన్నికలు వస్తే పొ త్తులు, ఎత్తులు, కుయుక్తులు పైనే ఆధారపడతాడని అన్నారు.అతనికి ఒక వ్యక్తి బలం ఉందని ఆ వ్యక్తికి మొన్న తెలంగాణలో ఎన్నికల సభలో మాట్లాడుతూ, తెలంగాణలో తాను పుట్టనందుకు బాధపడుతున్నారని చెప్పడం ప్రజలు తెలుసుకోవాలని అన్నారు.

ఇటువంటి ప్యాకేజిస్తారు మ్యారేజి స్టార్ చంద్రబాబునాయుడుకు వంత పాడుతూ వస్తున్నారని అన్నారు. చివరకు తెలంగాణ ఎన్నికల్లో దత్తపుత్రుడు పార్టీకి ఎక్కడ డిపాజిట్ రాలేదని, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదని ముఖ్యమంత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రజలకు తాము ఏమి చేస్తాము అని చెప్పకుండా, కేవలం ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తూ వస్తున్నారని, ఉత్తరాంధ్ర అభివృద్ధి చేసేందుకు విశాఖను రాజధాని చేస్తానన్న అడ్డుపడుతున్నారని, ఈ ప్రాంతంలో ఏ అభివృద్ధి చేస్తున్నా ఆ ఇద్దరు నాయకులు ఏడుస్తున్నారని విమర్శించారు. వేరే రాష్ట్రంలో వీరు శాశ్వత నివాసం ఉంటూ ఒక దొంగల ముఠాగా అక్కడ నుంచి ఈ రాష్ట్రంలో మనపై ఏడుస్తున్నారని విమర్శించారు. ఈ నాన్ లోకల్ నాయకులు అందరూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ ఉండాలి, ఈ రాష్ట్ర రాజధాని ఏమి చేయాలి అని ప్రచారం చేస్తుంటారని ఇది విడ్డూరమని అన్నారు. వారు ఏనాడు ఇవ్వని పింఛన్లు కూడా ప్రతి నెల ఒకటో తారీకు ఇస్తున్నామని వెయ్యి రూపాయలు ఇచ్చిన పింఛన్లు ఇప్పుడు 2750 అందిస్తున్నామని ఇలా చేసినా కూడా తమ ప్రభుత్వంపై ఏడుస్తున్నారని విమర్శించారు.

చంద్రబాబు హయాంలో నష్టపోయిన రైతులకు తమ ప్రభుత్వం ఆదుకునే విధంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు బీమా పంట నష్టపరిహారం ఇస్తూ,ఇటువంటి ఎన్నో సదుపాయాలు వారి గ్రామాల్లోనే అందిస్తున్నప్పటికీ దానిపై కూడా వారు ఏడుస్తున్నారని టిడిపిని విమర్శించారు. ఐదు సంవత్సరాల పాలనలో ఒక్క పేదవాడికి కూడా సెంటు భూమి ఇవ్వని చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 32 లక్షల మందికి పట్టాలు అందజేసి ఇళ్ళు నిర్మిస్తున్నప్పటికీ టిడిపి నాయకులు ఏడుస్తున్నారని, ఇలా ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా,ఏ సంక్షేమ కార్యక్రమం చేపట్టినా అన్నిటిపై కూడా టిడిపి నాయకులు ఏడుస్తుంటారని ఆయన విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలలో ప్రజలకు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో 10% కూడా అమలు చేయలేకపోయారని, అయితే తమ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీతగా, ఖురాన్ గా, బైబిల్ గా భావించి అందులో ఇచ్చిన హామీలను 90 శాతం అమలు చేస్తున్న తమపై ఈ తెలుగుదేశం నాయకులు ఏడుస్తున్నారని అన్నారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఏకంగా రెండున్నర రెండున్నర లక్షల కోట్ల రూపాయలు వివిధ సంక్షేమ పథకాల కింద ఎటువంటి లంచం ఎవరికి ఇవ్వకుండా వారి ఖాతాలోనే నేరుగా జమ చేస్తున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏడుస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు. ఇంకా మూడు నెలలు మాత్రమే ప్రజలు వీటిని భరించాలని, వచ్చే ఎన్నికల్లో ఇటువంటి నాల్ లోకల్ నాయకులను, పేదల వ్యతిరేకులను తిప్పి కొట్టాలని వారంతా మన వైపు కన్నెత్తి చూడకుండా ప్రజలు వచ్చే ఎన్నికల్లో తీర్పు చెప్పాలని జగన్మోహన్ రెడ్డి ప్రజలను కోరారు. ప్రజలు ఎవరు మాట ఇచ్చారు, ఎవరు మాటను నిలబెట్టుకున్నారు అన్నది తెలుసుకోవాలని కోరారు . మీకు మంచి జరిగింది అని భావిస్తే మీ బిడ్డనైన నాకు మీరే సైనికులుగా నిలిచి గెలిపించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలు మీకు బంగారం బెంజ్ కారు కూడా ఇస్తామన్నా ఆశ్చర్యపోవక్కలేదని, అయితే ప్రజలు మంచి చేసే వారిని గుర్తించాలని కోరారు. ఈ సభలో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మంత్రులు ధర్మాన ప్రసాదరావు బూడి ముత్యాల నాయుడు సీదిరి అప్పలరాజు శాసనసభ్యులు ధర్మాన్ని కృష్ణదాసు కంబాల జోకులు గొర్లె కిరణ్ కుమార్, రెడ్డి శాంతి, జడ్పీ చైర్ పర్సన్ ఫిర్యాదు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ఎమ్మెల్సీలు పాలవలస విక్రాంత్, దువ్వాడ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ శ్రీకేష్, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి కృష్ణ బాబు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement