Sunday, April 28, 2024

ధాన్యం న‌గ‌దు అయిదు రోజుల్లోనే జ‌మ – ఎపి రైతుల‌కు ఊర‌ట‌

అమరావతి, ఆంధ్రప్రభ: అకాల వర్షాలకు పంటలను కోల్పోయిన రైతులకు ఊరట కలిగించేలా ధాన్యం కొనుగోలు నగదును రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన అందచేస్తోంది. ధాన్యం కొనుగోలు చేసిన తరువాత మూడు వారాల్లోపు రైతుల బ్యాంకు ఖాతాలకు నగదును జమ చేస్తుండగా అకాల వర్షాల నేపథ్యంలో కేవలం ఐదు రోజుల్లోనే ఆ ప్రక్రియను అధికారులు పూర్తి చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆదేశాలతో ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే వీలైనంత తొందరగా నగదును రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రాధాన్యత నిస్తున్నారు. ఈ మేరకు ఈనెల 10న బుధ వారం ఒక్క రోజే 32,558 మంది రైతులకు రూ.474 కోట్ల నగదును వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. రబీ సీజన్‌లో ఇప్పటివరకు రూ.1277 కోట్లను జమచేసినట్టు- అధికారులు ప్రకటించారు. 82.58 శాతం మంది రైతులకు నగదు జమ కాగా.. కొందరు రైతుల విషయంలో ఎదుర వుతున్న సాంకేతిక సమస్యలను కూడా ఎప్పటికపుడు పరిష్కరిస్తున్నట్టు- అధికారులు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన కేవలం ఐదు రోజుల్లో అకాల వర్షాల వల్ల ఎక్కువగా నష్టపోయిన పశ్చిమ గోదావరి జిల్లా రైతులకు రూ.527 కోట్లు-, ఏలూరు జిల్లా రైతులకు రూ.296 కోట్లు-, తూర్పుగోదావరి రైతులకు రూ.258 కోట్లు-, కోనసీమ జిల్లా రైతులకు రూ.100 కోట్లను జమ చేసినట్టు- పౌరసరఫరాల శాఖ ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement