Saturday, May 4, 2024

Ongole – రైతు బాధ‌లు ప‌ట్ట‌ని జ‌గ‌న్ … వైఎస్సార్ వార‌సుడు ఎలా అవుతాడు? ష‌ర్మిల

(ప్రభన్యూస్, ఒంగోలు బ్యూరో) – రాష్ట్ర ప్రజలకు మేలు చేయటం కోసమే మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాంగ్రెస్ లోకి వచ్చింది. ఇక్కడి టీడీపీ, వైసీపీలు బీజేపీకి అమ్ముడుపోయాయి కాబట్టే ఏపీ లోకి అడుగు పెట్టాల్సి వచ్చింది..వైఎస్సార్ రక్తం ఈ బిడ్డలో ప్రవహిస్తోంది..రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలని.. విభజన హామీలు నెరవేరాలని అడుగుపెట్టింది. అని ఏపీసీసీ ఛీప్వైఎస్ షర్మిల అన్నారు. ప్రకాశం జిల్లాలో పర్యటన సందర్భంగా ఒంగోలులో కాంగ్రెస్కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మళ్లీ రైతులు రాజవ్వాలి.. రైతులకు రుణమాఫీ కావాలి..అన్నీ వైపుల నుంచి నాపై దాడి మొదలు పెట్టారని, వై అంటే వైవీ సుబ్బారెడ్డి.., ఎస్ అంటే విజయసాయిరెడ్డి, ఆర్ అంటే సజ్జల రామకృష్ణా రెడ్డి అని విమర్శలు గుప్పించారు. వెలిగొండ ప్రాజెక్టు ఇప్పటివరకు పూర్తయ్యిందా, యువత కోసం నిమ్జ్ ఇప్పటి వరకు మొదలైందా, జిల్లాకు ఎయిర్ పోర్ట్ అన్నారు.. దానికో పేరు పెట్టారు.. ఏమైంది.? బోయింగ్ విమానాలు తిప్పుతానన్నారు.. ఏమయ్యాయి.. గాలికి పోయాయి అని షర్మిల ప్రశ్నించారు.

జ‌గ‌న్ వైఎస్సార్ వార‌సుడు ఎలా అవుతాడు..
వైఎస్సార్ ఉన్నప్పుడు రైతులకు ఉన్న సబ్సిడీలు ఉన్నాయా? వైఎస్సార్ పాలనకు జగనన్న పాలనకు నక్కకు.. నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది.. భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉందని, జాబ్ క్యాలెండర్ అన్న జగనన్న మాటలు ఏమయ్యాయి? 30 వేల టీచర్ ఉద్యోగాలు ఏమయ్యాయి..ఏపీలో గ్రూపు ఉద్యోగానికి ఎవరూ అర్హులు కారా..మాట ఇస్తే మాట తప్పని.. మడమ తిప్పని నేత వైఎస్సార్. మద్యపాన నిషేధం అన్న జగనన్న.. పూర్తి మద్యపాన నిషేదం చేయకుండా ఓట్లు ఎలా అడుగుతారు? అని షర్మిల ప్రశ్నించారు. గంగవరం పోర్టు ప్రభుత్వం చేతుల్లోకి రాకుండా చేశారు. వైఎస్సార్ ఉంటే 30 ఏళ్లకు ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేది.సజ్జల గంగవరం పోర్టు అమ్మగా వచ్చిన 600 కోట్లతో మిగతా పోర్టులు అభివృద్ధి చేశామని నిస్సిగ్గుగా చెబుతున్నారు..రాష్ట్రంలో ప్రజలు పాలన ఎలా ఉందో చూస్తున్నారు..ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి..వైసీపీ, టీడీపీలు బీజేపీ తొత్తులుగా మారాయి.ఒక్క ఎంపీ సీటు కూడా ఏపీ లేకపోయినా రాష్ట్ర ప్రజలను బానిసలుగా చూస్తున్న బీజేపీ..మతతత్వ పార్టీ కాబట్టే వైఎస్సార్ బీజేపీని పూర్తిగా వ్యతిరేకించారు.జగనన్న మాత్రం బీజేపీకి తొత్తుగా మారారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా..విశాఖ స్టీల్ ప్లాంట్, నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతుల రాజ్యం తీసుకువస్తాం, రైతుల రుణామాఫీ జరగాలి, అందుకు కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు నేను రెడీ.. మీరు రెడీనా అని షర్మిల కాంగ్రెస్ కార్యకర్తలను ప్రశ్నించారు.

గుండ్లకమ్మ ప్రాజెక్టు సందర్శన

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం వద్ద గుండ్లకమ్మ జలాశయాన్ని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సందర్శించారు. ఇటీవల కొట్టుకుపోయిన గేట్లను పరిశీలించి ఆయకట్టు రైతులతో మాట్లాడారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు రఘువీరారెడ్డి, పల్లంరాజు, గిడుగు రుద్రరాజు తదితర నేతలు సందర్శించారు. వైసీపీ ప్రభుత్వం గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్వహణను గాలికి వదిలేసిందని ఏపీసీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. రాజశేఖరరెడ్డి రూ. 750 కోట్లతో ప్రాజెక్టును నిర్మిస్తే… ప్రాజెక్టు నిర్వహణ కోసం వైసీపీ ప్రభుత్వం ఏడాదికి కోటి రూపాయలు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. జలయజ్ఞంలో భాగంగా గుండ్లకమ్మ ప్రాజెక్టును వైఎస్సార్ నిర్మించారని… ఆ ప్రాజెక్టు యాజమాన్య నిర్వహణ కూడా చేయని మీరు వైఎస్ వారసుడు ఎలా అవుతారని ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గేట్లు కొట్టుకుపోవడం వల్ల రెండు టీఎంసీల నీరు వృథాగా సముద్రంలోకి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ఖాళీ కావడంతో… నీళ్లు లేక ఆయకట్టు రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. రాజశేఖరరెడ్డి ఆశయాలను నిలబెడుతున్నానని జగనన్న అంటున్నారని… ఇదేనా ఆశయాలను నిలబెట్టడం? అని విమర్శించారు.

ప్రాజెక్టు నిర్వ‌హ‌ణ చేత‌కాని సీఎం అవ‌స‌ర‌మా?
లక్ష ఎకరాలకు సాగునీరు, 12 మండలాలకు తాగునీరు ఇచ్చే ప్రాజెక్ట్ గుండ్లకమ్మ అని షర్మిల చెప్పారు. 16 నెలల కిందట ఒక గేటు, మూడు నెలల కిందట మరో గేటు కొట్టుకుపోయాయని అన్నారు. ప్రాజెక్టు నిర్వహణలో లోపం కారణంగానే గేట్లు కొట్టుకుపోతున్నాయని చెప్పారు. ఐదు సంవత్సరాల నుంచి సరిగా నిర్వహించి ఉంటే గేట్లు కొట్టుకుపోయేవి కాదని చెప్పారు. రూ, 10 కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్టు నిలబడుతుందని లేకపోతే ఈ ప్రాజెక్టు నిరుపయోగంగా మారుతుందని ఎస్ఈ చెపుతున్నారని అన్నారు. ప్రాజెక్ట్ నిర్మించినా వృథా అయిపోతుందని చెపుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని ప్రాజెక్టుకు చేయాల్సిన మరమ్మతులు వెంటనే చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. ప్రాజెక్టు గేటు నీటిలో తేలుతోందని దీన్ని చూస్తే మీరే అవమానంతో తల దించుకోవాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు జ‌గ‌న్ అన్న పాల‌న‌ పనితీరు ఇదే అని ఆ గేటు సాక్ష్యం చెపుతోందని వ్యాఖ్యానించారు. గత టీడీపీ ప్రభుత్వం కూడా ఆ ప్రాజెక్టు కోసం ఏం చేసిందో చెప్పాలని అన్నారు. ఇదే సమయంలో ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబుపై ఆమె సెటైర్లు వేశారు. సంబంధిత మంత్రి సంక్రాంతి డ్యాన్సులు చేస్తాడే తప్ప పని చేయడం తెలీద‌ని కౌంట‌ర్ వేశారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement