Saturday, May 4, 2024

BJP: అమిత్‌షా తెలంగాణ ప‌ర్య‌ట‌న ర‌ద్దు… అత్యవసర పనుల వల్ల వాయిదా

రేపు తెలంగాణ‌లో కేంద్రమంత్రి అమిత్ షా పర్యటన రద్దు అయింది. బీహార్‌లో రాజకీయ పరిణామాలతో పర్యటన రద్దు చేసుకున్నారు. అమిత్ షా పర్యటన రద్దు విషయాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.

వాస్తవానికి ఆదివారం రాష్ట్రంలో పర్యటించాల్సి ఉంది. ఈ క్రమంలో రద్దు అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కొన్ని అత్యవసర పనుల వల్ల రాష్ట్రంలో అమిత్ షా పర్యటన వాయిదా పడిందని కిష‌న్‌రెడ్డి తెలిపారు. దీంతో కరీంనగర్, మహబూబ్ నగర్, హైదరాబాద్ సమావేశాలు వాయిదా వేశామని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement