Friday, December 6, 2024

అవినాష్ బెయిల్ పై అభ్యంతరం.. సుప్రీంలో సునీత పిటిషన్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య మిస్టరీ కేసు కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. అయితే రోజు రోజుకూ శరవేగంగా పరిణామాలు మారుతున్నాయి. తాజా అరెస్ట్ ల నేపథ్యంలో ఎప్పుడు ఏమవుతుందోననే ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ కేసులో తనను అరెస్ట్ చేసే అవకాశముందని భావించిన కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పొందారు. ఈనెల 25వ తేదీ వరకు అవినాష్ ను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు సూచించింది.

ఈ నేపథ్యంలో వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత రెడ్డి సుప్రీంకోర్టు ను ఆశ్రయించారు. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ పై ఆమె అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం మాత్రం రేపు సునీత పిటీషన్ విచారిస్తామని పేర్కొంది. మరోవైపు అవినాష్ రెడ్డి రోజూ సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. 25వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పిన కోర్టు.. నిత్యం విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది. దీంతో నిన్న ఐదు గంటల పాటు ఆయన్ను సీబీఐ అధికారులు విచారించారు. ఇవాళ కూడా సీబీఐ కార్యాలయానికి అవినాష్ రెడ్డి వెళుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement