Sunday, April 28, 2024

No Permission – తిరుపతిలో హీరో ధనుష్ సినిమా షూటింగ్ రద్దు…

తిరుపతిలో హీరో ధనుష్ సినిమా షూటింగ్ కు సంబంధించి రేపటి అనుమతిని రద్దు చేశారు తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని రద్దు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు..కాగా.. రేపు గోవింద రాజస్వామి ఆలయం వద్ద షూటింగ్ చేసి తీరుతామని చిత్ర యూనిట్ ప్రకటించింది. షూటింగ్ చేస్తే అడ్డుకుంటామని, భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని బీజేపీ వార్నింగ్ ఇచ్చింది. కాగా.. ఈ వివాదం పెద్దది కావడంతో రేపటి సినిమా షూటింగ్ కు పోలీసులు అనుమతి రద్దు చేశారు.

ఇదిలా ఉంటే.. ఉదయం అలిపిరి గరుడ సర్కిల్ వద్ద చిత్ర యూనిట్ షూటింగ్ నిర్వహించింది. అలిపిరి రోడ్డులో నగర ప్రధాన వీధుల్లో సినిమా షూటింగ్ చేశారు. దీంతో.. భక్తులు, విద్యార్థులు, అంబులెన్స్ లు, నగర ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. అంతేకాకుండా.. షూటింగ్ పేరుతో గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రశ్నించిన వారిపై బౌన్సర్లతో దాడి చేశారని భక్తులు ఆరోపించారు.

ఈ క్రమంలో.. తిరుపతి ప్రధాన రోడ్లపై సినిమా షూటింగ్ లకు అనుమతి ఇవ్వవద్దని పోలీసులకు ఫిర్యాదు చేశారు. టెంపుల్ సిటీలో సినిమా షూటింగ్ లకు అనుమతి ఇచ్చిన వారిపై ఈస్ట్ పోలీసులకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఆధ్మాత్యిక క్షేత్రం.. అది తిరుమలకు వెళ్ళే రోడ్డు.. ఎలా షూటింగ్ అనుమతి ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రేపటి షూటింగ్ అనుమతి రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేయగా.. తాజాగా సినిమా షూటింగ్ కు సంబంధించి రేపటి అనుమతిని రద్దు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement