Tuesday, May 14, 2024

AP | టీడీపీ ఎవరితో పొత్తు పెట్టుకున్నా మళ్లీ అధికారం మాదే : మంత్రి బొత్స

అధికారం ముఖ్యం కాదని, తమకు నైతిక విలువే ముఖ్యమన్నారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలు ఉన్నాయా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడో ఓ చోట ఉన్న టీడీపీ సైతం ఈ ఎన్నికల తరువాత కనుమరుగు అవుతుందన్నారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పొత్తల కోసం అందరి గుమ్మం ఎక్కుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్ని పొత్తులు పెట్టుకున్నా.. 175 స్థాలనాలకు 175 స్థానాలను వైసీపీ గెలుస్తుందని పేర్కొన్నారు.

అధికారం కోసం ఆ మూడు పార్టీలు వెంపర్లాడుతున్నాయని.. అందుకే కూటమిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నాయని విమర్శించారు. వైసీపీ ఏ పార్టీతోనూ పెట్టుకోదని, తమకు అలాంటి అవసరం లేదని స్పష్టం చేశారు. 3 పార్టీలు కాదు, 30 పార్టీలు పొత్తు పెట్టుకున్నా వైసీపీని, జగన్‌ను ఏం చేయలేవన్నారు. తమకు ప్రజలతో మాత్రమే పొత్తు అని, వారి మద్దతుతో మరోసారి ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడమే వైసీపీ విధానమని సీఎం జగన్ చెప్పిన మాటల్ని గుర్తుచేశారు.

ఇక, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై బీజెపీ, చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు అని ప్రశ్నించారు. మేదరమెట్ల సభకు వచ్చిన జనం గ్రాఫిక్స్ అనే విమర్శలు పచ్చకామెర్లు వచ్చిన వాళ్ళలా వున్నాయని మండిపడ్డారు. చంద్రబాబును అదే భ్రమలో వుండమనండి.. ప్రజలే నిర్ణయం ఇస్తారని వార్నింగ్‌ ఇచ్చారు. మరోవైపు.. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ పై బీజెపీ నాయకత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వెంకట్ రెడ్డి ఎవరు వచ్చి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడిన టైం వేస్ట్ అన్నారు. ఈ రాష్ట్రంలో బీజెపీ, టీడీపీ ఉన్నాయా..? అంటూ ఎద్దేవా చేశారు.. ఎన్నికల ప్రచారంపై ప్రణాళికలు రూపొందిస్తున్నాం అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.

Advertisement

తాజా వార్తలు

Advertisement