Sunday, May 5, 2024

డుమ్మాకొడుతున్న డాక్ట‌ర్లు.. మూలనపడిన వైద్య పరికరాలు

నెల్లూరు, ప్రభన్యూస్‌ : జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి ఎక్కువగా పేద , అట్టడుగు వర్గాల వారే వస్తుంటారు. వివిధ రోగాలతో ఆస్పత్రికి వచ్చే వారికి ఆస్పత్రిలోనే వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స చేయాల్సిఉండగా , ప్రస్తుతం పెద్దాస్పత్రిలో పరీక్షలు సక్రమంగా నిర్వహించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేట్‌ ల్యాబ్‌ల వద్ద మీషన్లకు ఆశపడుతున్న కొంత మంది వైద్యులు, సిబ్బంది ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించే పరికరాలను కూడా మూలన పడేశారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. వీటన్నింటినీ తనిఖీ చేసి పరీక్షల నిర్వహణ తీరును సక్రమంగా పర్యవేక్షించాల్సి ఉంది.

కాగా , పెద్దాస్పత్రిలో విధి నిర్వహణ పట్ల అత్యంత శ్రద్ధ చూపుతూ పనిచేసే వైద్యులకు కొదువ లేదు. అలాగే తూతూ మంత్రంగా విధులు నిర్వహిస్తూ అటెండెన్సులో సంతకాలు పెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్య శిఖామణులకు కొదువలేదు. బయట తమ ప్రైవేట్‌ క్లినిక్‌లపై ఉన్న శ్రద్ధ లక్షలాది రూపాయలు జీతాలు తీసుకుంటున్న ప్రభుత్వ కొలువుపై లేదన్న విమర్శలు కూడా ఎప్పటి నుంచో ఉంటున్నవే. ముఖ్యంగా ప్రభుత్వ వైద్య కళాశాలలో పీజీ అభ్యసిస్తున్న విద్యార్థులు రోగుల పట్ల ఎంతో అమానవీయంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోవణలు గుప్పుమంటున్నాయి. ఈ విషయంలో పట్టించుకున్న నాధుడే కనపడడం లేదు. వారిని ఆదర్శంగా తీసుకుంటూ జూనియర్‌ వైద్యులు కూడా అదే దారిలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement