న్యూ ఢిల్లీ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ భేటీ అయ్యారు. టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. జగన్ పాలన, ప్రతిపక్షాల అణచివేత అంశాలను రాష్ట్రపతికి వివరించారు. ఎపిలో ప్రజాస్వామం ఎక్కడ కనిపిచడం లేదని పేర్కొన్నారు.. విపక్షాలను తప్పుడు కేసులలో ఇరికించి జైలుకు పంపుతున్నారంటూ ఆధారాలను రాష్ట్రపతికి అందజేశారు.. రాష్ట్రపతిని కలిసిన నారా లోకేష్ బృందంలో టిడిపి ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్ ఉన్నారు.
- Advertisement -