Sunday, April 28, 2024

TS: మహిళా చైతన్యానికి ప్రతీక వీరనారి ఐలమ్మ.. మంత్రి వేముల

వేల్పూర్, సెప్టెంబర్ 26 (ప్రభ న్యూస్) : మహిళా చైతన్యానికి ప్రతీక, ధీర వనిత చాకలి ఐలమ్మ అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో చాకలి (చిట్యాల) ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. జోహార్ చాకలి ఐలమ్మ అని నినదించారు. ఈ సందర్బంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ… వెట్టిచాకిరికి వ్యతిరేకంగా, బానిసత్వ విముక్తి కోసం పోరాడిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, ధీర వనిత చాకలి ఐలమ్మ అని మంత్రి వేముల కొనియాడారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆమె పోరాట స్ఫూర్తిని చాటేలా అధికారికంగా జయంతి, వర్ధంతిని నిర్వహిస్తోందన్నారు. మంత్రి వెంట నివాళులర్పించిన వారిలో రైతు నాయకుడు కోటపాటి నర్సింహనాయుడు, ఆర్డీవో వినోద్ కుమార్, ఏసీపీ జగదీశ్వర్ చందర్, స్థానిక అధికారులు, పలువురు రజక నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement